ఒకవైపు హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో దళిత బందు పథకాన్ని ప్రవేశ పెట్టడమే కాదు.. మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న వాసాలమర్రి అనే గ్రామాన్ని దత్తత తీసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ క్రమంలోనే ఇక వాసాలమర్రి లో పలుమార్లు సభలు నిర్వహిస్తూ అక్కడ అభివృద్ధి కోసం ఇప్పటికే వరాల జల్లు కురిపించారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో భాగంగా ఇక అర్హులైన వారందరికీ కూడా నిధులు కూడా విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. దళిత బంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఇక కెసిఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రి లోనే ప్రారంభించారు.
ఈ క్రమంలోనే దళిత బంధు పథకం కింద యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి లోని 76 దళిత కుటుంబాలకు నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. ఈ పథకంలో భాగంగా కుటుంబాలకు నిధులు విడుదల చేసేందుకు ఏకంగా 7.60 కోట్లను ఖర్చు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఈ నిధులు మొత్తాన్ని కలెక్టర్ కార్యాలయానికి విడుదల చేసినట్లు ఇటీవల తెలిపారు. ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షల చొప్పున బ్యాంక్ అకౌంట్లో జమ చేసినట్లు తెలిపింది. ప్రభుత్వం అందిస్తున్న పది లక్షల రూపాయలను దళిత కుటుంబాలు ఇక ఉపాధి పొందడానికి ఉపయోగించుకోవాలి అని ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి