రాజకీయాలు అన్న తర్వాత ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని కొన్ని సార్లు ఏకంగా తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటూ ఉంటారు. కానీ ఎంత విమర్శలు చేసుకున్నా ఒకరిపై ఒకరు దాడి చేయడం లేదా హత్య చేయడం లాంటివి మాత్రం అస్సలు చేయరు. కానీ ఇటీవల ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చి సంచలన గా మారి పోయింది.  ఇది రాజకీయ కుట్ర లేదా ఏవైనా పాత కక్షలా తెలియదు కానీ ఇటీవలే ఓ యువ నేత హత్యకు గురికావడం రాష్ట్ర రాజకీయాలలో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయింది.


 ఉదయం సమయంలో కొంతమంది దుండగులు ఏకంగా యువనేత పై ఒక్కసారిగా కాల్పులు జరిపారు. అయితే ఇలా కొంతమంది దుండగులు యువనేత పై కాల్పులు జరుపుతున్న సమయంలో ఇక అతను తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. కానీ వెంటాడి వేటాడి మరీ దారుణంగా చంపేశారు దుండగులు. ఈ ఘటన ఇటీవలే పంజాబ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది.  ఏకంగా నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే యువనేతను దారుణంగా కాల్చి చంపారు గుర్తు తెలియని దుండగులు. ఈ ఘటన ఒక్కసారిగా పంజాబ్ రాజకీయాలను వేడెక్కించింది.



 పంజాబ్ మొహాలీ లోనే నడిరోడ్డుపై అకాలీదళ్  యువ నేత దారుణ హత్యకు గురయ్యాడు. అకాలీదళ్ స్టూడెంట్ వింగ్ మాజీ ప్రెసిడెంట్ అయిన విక్కీ మిద్దుఖేరే ను ఈరోజు ఉదయం  సమయంలో గుర్తుతెలియని దుండగులు దారుణంగా కాల్చి చంపారు. ఉదయం 10గంటల సమయంలో విక్కీ కార్ ఎక్కించేందుకు వస్తున్న సమయంలో అకస్మాత్తుగా వచ్చిన ఇద్దరు దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. దీంతో ఒక్కసారిగా విక్కీ షాక్ అయ్యాడు. ఆ తర్వాత కార్ దిగి పారిపోయేందుకు ప్రయత్నించిన దుండగులు మాత్రం వెంటాడారు. ఈ క్రమంలోనే ఏకంగా విక్కీ శరీరంలోకి 15 బుల్లెట్లు దూసుకుపోయాయ్. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతి చెందాడు విక్కీ.

మరింత సమాచారం తెలుసుకోండి: