ఇటీవలే ఢిల్లీలో అత్యాచార ఘటన జరిగింది. అయితే అత్యాచార బాధిత కుటుంబాన్ని రాహుల్ గాంధీ పరామర్శించారు. అంతేకాదు వారితో ఒక ఫోటో దిగి దానిని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సాధారణంగా అత్యాచారం జరిగిన నిందితులకు సంబంధించిన ఫోటోలను ఐడెంటిటీని కూడా ఎక్కడా రివీల్ చేయరు పోలీసులు. కానీ రాహుల్ గాంధీ ఇటీవలే పరామర్శ పేరుతో బాధితులు ఐడెంటిటీ రివీల్ చేశాడు. దీని ప్రకారం జువైనల్ చట్టాన్ని ఇక ఉల్లంఘించినట్లు అయింది దీనిపై జాతీయ బాలల హక్కుల కమిషన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
దీంతో అటు పోలీసులు ట్విట్టర్ కు నోటీసులు జారీ చేయగా.. ట్విట్టర్ రాహుల్ గాంధీ కి షాక్ ఇచ్చింది. ఆయన ట్విట్టర్ అకౌంట్ను తాత్కాలికంగా బ్లాక్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే గతంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి కూడా ఇలాంటి తరహా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. పలుమార్లు ట్విట్టర్ ట్రంప్ విషయంలో పగ తీర్చు కున్నట్లుగానే వ్యవహరించింది. కొన్నిసార్లు ఏకంగా ట్విటర్ అకౌంట్ ను నిలిపి వేయడమే కాదు ఇక ఒకానొక సమయంలో ఏకంగా డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ను పూర్తిగా తొలగించింది. అప్పట్లో విద్వేష పూరితమైన పోస్టులు పెడుతున్నారు అనే కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది ట్విట్టర్. ఇలా ఆంక్షలు విధించడంతో ప్రస్తుతం ఇండియాలో ప్రతిపక్షనేతగా ఉన్న రాహుల్ గాంధీ అమెరికాలో ప్రతిపక్ష నేతగా ఉన్న ట్రాంప్ లాగా మారిపోయారు అని అంటున్నారు అందరూ.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి