తెలంగాణ రాజకీయం మెల్ల మెల్లగా ఊపందుకుంటోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక వలన అన్ని పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే చివరికి విజయం ఎవరిని వరిస్తుందో చెప్పలేని పరిస్థితి. ఈ ఎన్నికలో ఎన్ని పార్టీలు పోటీ చేసినా అంతిమంగా రసవత్తర పోరాటం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు మరియు తెరాస అభ్యర్థికి మధ్యనే ఉండనుందని అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికను ఇరు పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎలాగైనా మళ్ళీ హజూరాబాద్ ఎమ్మెల్యే స్థానాన్ని తెరాస నిలబెట్టుకుంటుందని కెసిఆర్ ధీమాగా ఉన్నారు. ఇక తెరాస నుండి బయటకు వచ్చేసిన ఈటల రాజేంద్ర సైతం తగ్గేదేలే అంటూ, తన ప్రయత్నాల్లో ఉన్నారు.

హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రజలకు నాపైనే అభిమానముందని తప్పకుండా వారు నన్నే గెలిపించుకుంటారని దైర్యంగా ఉన్నారు. ఇప్పటి వరకు హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు అందిన ప్రతి ఫలంలో నా పాత్ర ఉందని ఘంటాపధంగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయిన రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలో ఏమి పాలుపోని స్థితిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎలాగు ఈ ఎన్నికలో గెల్వలేదని సొంత పార్టీ నాయకుడే బహిరంగంగా చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తన మద్దతును బీజేపీ లోని ఈటల రాజేందర్ కు మద్దతిస్తారని అంతా అనుకుంటున్నారు.

అయితే ఆదిలోనే ఇలాంటి నిర్ణయం తీసుకుంటే అధిష్టానం దగ్గర తన పరువుపోయే అవకాశం లేకపోలేదు. వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి అంత ఈజీగా మద్దతిచ్చే రకం కాదు. చివరి వరకు గెలుపే లక్ష్యంగా పోరాడే వ్యక్తిత్వం కల వాడు. కాబట్టి అందరూ అనుకున్నట్లే రేవంత్ రెడ్డి ఈటలకు మద్దతు ఇచ్చి తెరాసను దెబ్బ తీస్తాడా లేదా వారిద్దరికీ పోటీగా తన బలమేమిటో నిరూపించుకుంటాడా అన్నది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: