మొన్నటి వరకు ఘని అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పాలనాపరమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకోని అమృల్లా సలెహ్ ఇప్పుడు తనని తాను తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. అంతేకాదు ఇక ఆఫ్ఘనిస్తాన్ ప్రజలందరికీ నేనున్నాను అంటూ భరోసా ఇస్తున్నారు. తమ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటే చూస్తూ ఊరుకోబోము అంటూ తాలిబన్లను హెచ్చరిస్తున్నారు అమృల్లా సలెహ్. అయితే ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు ఇక దేశం విడిచి పారి పోవడం తో తమకు అడ్డు అదుపూ లేదు అని అనుకున్న తాలిబన్లకు ప్రస్తుతం అమృల్లా సలెహ్ తెరమీదకు రావడంతో ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి.
అంతేకాకుండా ఇక తన ఆధ్వర్యంలో సైన్యాన్ని తాలిబన్లపై దాడులు చేయిస్తున్నారు. తనదైన వ్యూహాలతో తాలిబన్లను ఊచకోత కోస్తూ ఉన్నట్లు ప్రస్తుతం అక్కడి మీడియా ప్రచురిస్తోంది. ఇక ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పటికే తాలిబన్లు స్వాధీనం చేసుకున్న చారికర్ సహా పలు ప్రాంతాలను కూడా మళ్లీ ఆఫ్ఘనిస్తాన్ సైన్యం అమృల్లా సలెహ్ ఆధ్వర్యంలో తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా మారబోతున్న అని అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది ఇక ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో అమృల్లా సలెహ్ దూకుడుగా తాలిబన్లకు ఎదురు వెళ్తున్న తీరు చూస్తుంటే తాలిబన్లకు అసలు మొగుడు ఇతడే నేమో అని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి