కరోనా వైరస్ ప్రభావం తగ్గడమే కాదు ఆక్సిజన్ నిల్వలు కూడా సరిపడిన దాని కంటే ఎక్కువ గానే ఉన్నాయి. దీంతో ప్రస్తుతం కావాల్సిన ప్రతి ఒకరికి విజయ వంతంగా ఆక్సీజన్ అందించ గలుగుతున్నాం. ఇకపోతే మొన్నటి వరకు ఆక్సిజన్ కొరత తో ఇబ్బంది పడిన భారత్ ఇప్పుడు ఆక్సిజన్ నిల్వలు ఎక్కువగా ఉండడం తో ఇతర దేశాలకు సైతం సహాయం చేసేందుకు ముందుకు వస్తుంది. ప్రస్తుతం కరోనా వైరస్ పై పోరాటం చేస్తున్న శ్రీలంక విషయం లో అది భారత్ గొప్ప మనసు చాటుకుంది. భారీగా ఆక్సిజన్ సహాయం చేసేందుకు సిద్ధమైంది భారత్.
150 టన్నుల ఆక్సిజన్ను శ్రీలంకకు పంపింది భారత్. వైజాగ్, చెన్నై ఆక్సీజన్ కొలంబో చేరినట్లు ఇటీవలే భారత హై కమిషనర్ తెలిపారు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే కోరటం తో ఇక భారత్ సహాయం అందిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇది వరకు అటు భారత్ శ్రీలంక కు వ్యాక్సిన్లు కూడా పంపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శ్రీలంక లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతున్నాయి. దీంతో ఇక మళ్లీ అక్కడ విపత్కర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి సమయం లో ఏకంగా శ్రీలంక ప్రభుత్వం లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి