ప్రజాస్వామ్యం అనే పదాన్ని కాళ్ళ కింద వేసి తొక్కేసిన తాలిబన్లు ఆయుధాలు చేత పట్టి ఆప్ఘనిస్తాన్లో ఆధిపత్యాన్ని సాధించారు.  ప్రభుత్వం తాలిబాన్లకు లొంగిపోవడం.. సైనికులు భయపడి పోవడంతో ఇక దేశ ప్రజలందరికీ కూడా బానిసలుగా మార్చుకున్నారు. దీంతో రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఆఫ్ఘనిస్తాను తమ వశం చేసుకున్న తాలిబన్లకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఒకప్పుడు తాలిబన్ల ఆటలు కట్టిన అమెరికా సైతం ఇక ఇప్పుడు తాలిబాన్లకు సహకరిస్తున్నట్లుగా.. తమ సైన్యాన్ని ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనక్కి ఉపసంహరించుకుంది. ఇక తాలిబన్లు ఎన్ని అరాచకాలు సృష్టిస్తున్న చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది.



 దీంతో ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితులు రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలను దారితీస్తాయి అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇకపోతే ఇటీవలే ఏకంగా ఆఫ్గనిస్థాన్లో తాలిబన్లు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇక తాత్కాలిక ప్రభుత్వంలో ప్రధాన మంత్రిగా మంత్రిలుగా ఎవరు కొనసాగుతున్నారు అన్న విషయాన్ని కూడా వెల్లడించారు. అయితే ఇటీవలే ఇక తాలిబన్ల ప్రభుత్వంలో మంత్రివర్గంలో కొనసాగుతున్న వ్యక్తుల పేర్లు చూసి అంతర్జాతీయ సమాజం మొత్తం షాక్ అవుతుంది.



 అంతేకాదు ఏకంగా తాలిబన్ల ప్రభుత్వంలో రక్షణశాఖ మంత్రిగా ఒకప్పుడు కరుడు గట్టిన నేరస్థుడిగా ప్రపంచ దేశాలకు మోస్ట్ వాంటెడ్ గా మారిపోయిన ఒక ఉగ్రవాది కొడుకు ఎన్నిక కావడం హాట్ టాపిక్ గా మారిపోయింది 1999లో నేపాల్ నుంచి ఢిల్లీ వస్తున్న ic814 విమానాన్ని హైజాక్ చేయడం లో మాస్టర్ మైండ్ ప్లాన్ వేసిన ముల్లా ఒమర్ ఉన్నాడు. ఇక ఇతన్ని ఎన్నో  దేశాలు మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేర్చాయ్. అయితే ఇటీవలే మాస్టర్ మైండ్ ముల్లా ఒమార్ కుమారుడు మహమ్మద్ యాకూబ్ కు ఆఫ్ఘనిస్థాన్లో తాలిబాన్లకు ప్రభుత్వంలో ఏకంగా రక్షణశాఖ మంత్రిగా చోటు దక్కడం గమనార్హం. కాగా 176 మంది తో ఉన్న విమానాన్ని హైజాక్ చేసి కాహంధార్ తీసుకెళ్లి అక్కడ ఏడు రోజుల పాటు ఉండి ఇక జైషే మహమ్మద్ లీడర్ మసూద్ మరికొంతమంది టెర్రరిస్టులను విడుదల చేసిన తర్వాత విమానాన్ని వదిలేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: