ఒక్కసారి వలలో పడిన తర్వాత ఎంతో సులభంగానే డబ్బులు కొట్టేస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయ్. ఇప్పుడు ఇలాంటి తరహా మోసమే వెలుగులోకి వచ్చి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఏకంగా 11 రూపాయలు రీచార్జ్ చేసుకున్న వ్యక్తి అకౌంట్ లో నుంచి ఆరు లక్షలు మాయమయ్యాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే లో వెలుగులోకి వచ్చింది. సీనియర్ సిటిజన్ ఫోన్ కి ఒక మోసగాడు ఫోన్ చేసాడు. టెలికామ్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాను. మీ సిమ్ కార్డు బ్లాక్ కాబోతుంది.. వెరిఫికేషన్ చేసుకోవాలంటూ మాయమాటలతో నమ్మించాడు. అయితే ఆ నెట్వర్క్ ఆఫీస్ కి వెళ్లి వెరిఫికేషన్ చేసుకుంటా అంటూ పెద్దాయన చెప్పగా.. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు ఇంట్లో నుంచి వెరిఫికేషన్ చేసుకునే అవకాశం ఉంది అంటూ మాయమాటలతో నమ్మించాడు.
దీనికోసం మీ మొబైల్ ఫోన్ కి ఒక లింక్ పంపిస్తాను. ఆ లింక్ పై క్లిక్ చేసి కేవలం 11 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది అంటూ కేటుగాడు చెప్పాడు. ఇక ఇంట్లో నుండి వెరిఫికేషన్ చేసుకోవడం అంటే ఎంతో బెటరే కదా అనుకున్న ఆ సీనియర్ సిటిజన్ లింకు ఓపెన్ చేశాడు. ఆ తర్వాత 11 రూపాయలు రీఛార్జ్ కూడా చేసుకున్నాడు. కానీ అంతలో ఊహించని షాక్ తగిలింది. ఏకంగా ఆరు లక్షల రూపాయలు అకౌంట్ నుంచి కట్ అయినట్లు మెసేజ్ వచ్చింది ఇక వెంటనే షాక్ అయిన ఆ పెద్దాయన పోలీసులకు దగ్గరికి పరుగులు పెట్టి ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి