టిడిపిలో కీలక నేతగా ప్రస్తుత అసెంబ్లీ సభ్యుడిగా ఉన్న నందమూరి బాలకృష్ణ ఎక్కువగా రాజకీయాల పై ఫోకస్ చేయడం లేదు. అటు టిడిపి నేతలు అందరూ కూడా అధికార పార్టీ తీరును ఎప్పుడూ ప్రజల్లోకి తీసుకెళ్లి ఇక అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ చేస్తున్న పనుల పై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. కానీ అటు నందమూరి బాలకృష్ణ గత కొంత కాలం నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనడం లేదు అని చెప్పాలి.



 ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోగా కొనసాగుతున్న బాలకృష్ణ అఖండ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే అటు రాజకీయాలపై దృష్టి సారించడం లేదు బాలకృష్ణ. కానీ మరికొన్ని రోజుల్లో బాలకృష్ణ రాజకీయాలకే పరిమితం కాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక దీనికంతటికీ కారణం  బాలకృష్ణ ఇటీవల ఇచ్చిన స్టేట్మెంట్ కావడం గమనార్హం. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా తర్వాత రోడ్లమీద కి వస్తాను. నేను ఏంటో నా సంగతి ఏంటో చూపిస్తా..  ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదు..  దేనికైనా సిద్ధం.. ఏదైతే అది అవుతుంది ప్రజల కోసం ఏం త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను అంటూ బాలకృష్ణ ఇచ్చిన స్టేట్మెంట్ కాస్త హాట్ టాపిక్గా  మారిపోయింది.



 గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయను చెప్పి.. ఎన్నికలను బహిష్కరిస్తామని అంటూ చెప్పటం ఎంతోమంది క్యాడర్లో అసంతృప్తికి కారణం అయింది.  ఈ క్రమంలోనే ఇక గ్రౌండ్ లెవల్ లో క్యాడర్ అధిష్టానం నిర్ణయాలపై కాస్త అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది  ఇక ఇలా కార్యకర్తల్లో నిండిపోయిన అసంతృప్తుని చల్లార్చడానికి బాలకృష్ణను రంగంలోకి దింపాలని మాస్టర్ మైండ్ చంద్రబాబు ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. బాలకృష్ణతో రాష్ట్రవ్యాప్తంగా టూర్లు ఏర్పాటుచేసి..  కార్యకర్తలందరూ లో మరింత ధైర్యాన్ని నింపడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు .ఇక బాలయ్య ఎంతో దూకుడుగా పర్యటనలు చేస్తూ  అధికార పార్టీపై విమర్శలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని భావిస్తున్నారట చంద్రబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: