పాకిస్థాన్లో ద్వైపాక్షిక సిరీస్ ఆడటానికి ఏ దేశం కూడా ముందుకు రాదు.  ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ అయిన పాకిస్థాన్లో భద్రతా పరమైన కారణాల దృష్ట్యా చాలా ఏళ్ల నుంచి ఏ దేశం కూడా పాకిస్థాన్ పర్యటనకు వెళ్లడం లేదు. మొదట భారత్ పాకిస్థాన్ పర్యటనలను పూర్తిగా రద్దు చేసుకోగా.. ఆ తర్వాత బంగ్లాదేశ్ కూడా ఇలాంటి తరహా నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో ఇంగ్లాండ్ కూడా ఇటీవలే పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకుని సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ఎన్నో ఏళ్ల తర్వాత పాకిస్థాన్ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధం అయింది న్యూజిలాండ్ జట్టు.


 న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు  పాకిస్థాన్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ కూడా ప్రకటించింది. ఇక కివీస్ జట్టు పాకిస్తాన్ చేరుకొని హోటల్లో క్వారంటైన్ లో కూడా ఉన్నారు. కానీ అంతలో ఏమైందో తెలియదు కానీ ఇక భద్రతాపరమైన కారణాల దృష్ట్యా తాము పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకున్నాము అంటూ న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ఆ తర్వాత తమ జుట్టును స్వదేశానికి రప్పించింది.  దీంతో అటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కు ఊహించని షాక్ తగిలింది. అయితే ఇలా ఇలా వివిధ దేశాల జట్లను పాకిస్తాన్లో పర్యటనకు రాకపోవడానికి భారత్ కారణం అంటూ స్టేట్మెంట్ లు ఇవ్వటం మొదలు పెట్టారు పాకిస్తాన్ ప్రముఖులు.



 అయితే ఎన్నో ఏళ్ల క్రితమే పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకుంది భారత్. కానీ ఈ విషయంలో ఇటీవల మరోసారి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక వ్యాఖ్యలు చేసింది. రమిజ్ రాజా ఇటీవల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్గా ఎంపికయ్యారు.  ఇంట్లోనే ఇటీవలే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. ద్వైపాక్షిక మ్యాచ్లను తాము భారత్ తో ఆడబోము అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ మాత్రం అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంది. ఎందుకంటే భారత్ ఎన్నో ఏళ్ల క్రితం అటు పాకిస్థాన్ మ్యాచ్ ను నిషేధించింది.  కానీ ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం ఏంటి అని అనుకుంటున్నారు. పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమిజ్ రాజా ఇమ్రాన్ ఖాన్ కి డూప్లికేట్ గా  మారిపోయాడని అందుకే విచిత్రమైన స్టేట్ మెంట్ ఇచ్చాడు అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: