మద్యపాన నిషేధం....ఈ హామీని ఇచ్చేముందు నాయకులు కాస్త ఆలోచించి ఇస్తే చాలా బాగుంటుందని చెప్పొచ్చు. మద్యం వల్ల అనేక కుటుంబాలు నాశనమైపోతున్నాయి. అలా అని మద్యపాన నిషేధం జరిగే పని కాదు. ఒకవేళ ఎవరైనా మద్యపాన నిషేధం హామీ ఇస్తే అది కేవలం ఓటు బ్యాంకు రాజకీయమే అని చెప్పొచ్చు. ఇక 2019 ఎన్నికల ముందు కూడా జగన్ అదేవిధంగా ఓటు బ్యాంకు రాజకీయం చేశారని చెప్పొచ్చు.

ఎందుకంటే సాధ్యం కాని మద్యపాన నిషేధం హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక అందుకు తగ్గట్టుగా మాత్రం వెళుతున్నట్లు కనిపించడం లేదు. పేరుకు మాత్రం బెల్ట్ షాపులు తీసేశాం, మద్యం షాపులు తగ్గించేశాం అని చెబుతున్నారు. కానీ ఇవి చేస్తే మద్యపాన నిషేధం జరిగిపోయినట్లేనా? అంటే కాదనే చెప్పాలి. పైగా ధరలు భారీగా పెంచారు...ధరలు పెంచితే మద్యం తాగేవాళ్లు తగ్గుతారని జగన్ ప్రభుత్వం చెబుతోంది. అయితే దీని కంటే పెద్ద జోకు ఇంకొకటి లేదనే చెప్పొచ్చు. అయినా సరే జగన్ ప్రభుత్వం పదే పదే ఇదే మాట చెబుతోంది.

మద్యం వాడకం బాగా తగ్గిందని కూడా చెబుతోంది. కానీ ఇవన్నీ చేస్తే మద్యపాన నిషేధం చేస్తున్నట్లు కాదనే చెప్పొచ్చు. పైగా భారీగా ధరలు పెరగడం వల్ల అదే పేద, మధ్య తరగతి కుటుంబాలపై ఆర్ధిక భారం మరింత పెరిగింది. అలాగే నాసిరకం బ్రాండ్లు వల్ల ఆరోగ్యం కూడా బాగా దెబ్బతింటుంది. అయితే ఈ అంశాలపై ప్రతిపక్షాల నుంచి ఎప్పటికప్పుడు విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇదే సమయంలో వైన్స్‌లో డిజిటల్ ట్రాన్సక్షన్స్ ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం అన్నిచోట్లా డిజిటల్ ట్రాన్సక్షన్స్ వాడకం పెరిగింది. మరి వైన్స్‌లో ఫోన్ పే, గూగుల్ పే లాంటివి ఎందుకు పెట్టడం లేదు? అంటే...అది ప్రభుత్వమే చెప్పాలి. మరి డిజిటల్ ట్రాన్సక్షన్స్ పెట్టకపోవడం వెనుక ఉన్న మర్మం ఏంటో?


మరింత సమాచారం తెలుసుకోండి: