కరోనా వైరస్ మనిషి జీవన శైలిని తలకిందులు చేయడమే కాదు అటు విద్యా రంగాన్ని కూడా సంక్షోభంలో కూరుకుపోయేలా చేసింది. అయితే కరోనా వైరస్ కారణంగా ఇక విద్యాసంస్థలు మూతపడడంతో ఎంతోమంది బతుకులు రోడ్డున పడ్డాయి అని చెప్పాలి. అప్పటి వరకు తాము ఉపాధ్యాయులం అని ఎంతో గర్వంగా చెప్పుకునేవారు..  ప్రైవేట్ విద్యా సంస్థల్లో పని చేస్తున్నప్పటికీ..  సమాజంలో ఎంతో గౌరవంగా బ్రతికే ఎవరు..  చాలీచాలని జీతాలు వస్తున్న నచ్చిన  వృత్తిలో కొనసాగుతున్నాము అనే ఒక సంతృప్తితో ముందుకు నడిచేవారు. కానీ కరోనా వైరస్ కారణంగా టీచర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిపోయింది.



 ఉపాధ్యాయ వృత్తిపై ప్యాషన్ తో ఎంతో మంది ప్రైవేటు టీచర్ లు గా పనిచేస్తున్న వారి జీవితాలను కరోనా వైరస్ నేలకేసి కొట్టినంత పని చేసింది.  ఒక్కసారిగా విద్యా సంస్థలన్నీ మూతపడడంతో ఇక ప్రైవేట్ టీచర్స్ అందరూ ఉపాధి కోల్పోయారు. ఇక రోజు రోజుకు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి.  ఓవైపు విద్యాసంస్థలు తెరుచుకోకపోవడం మరోవైపు వేరే పని చేసుకోవడానికి మనసోప్పుకోకపోవడంతో ఎంతోమంది ప్రైవేట్ టీచర్స్ ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.



 అయితే చాలీచాలని జీతాలు ఇచ్చి ప్రైవేట్ టీచర్స్ తో వెట్టి చాకిరి చేయించుకుంటున్న ప్రవేట్ స్కూల్ యాజమాన్యాలు కరోనా వైరస్ సమయంలో మాత్రం టీచర్స్ ను ఆదుకోవడం మానేసి చేతులెత్తేశాయి. దీంతో సభ్య సమాజంలో గౌరవంగా బ్రతికిన ప్రైవేట్ టీచర్స్ జీవితాలు  రోడ్డున పడ్డాయి.  కనీసం నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.  దీంతో ఎంతో మంది టీచర్లు కూలీలుగా మారిపోయారు.  ఇంకెంతో మంది మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు.  అయితే తమను ఆదుకోవాలి అంటూ ఎంతో మంది ప్రైవేటు టీచర్లు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. కానీ ప్రభుత్వానికి టైం ఎక్కడిది ఎప్పటికప్పుడు రాజకీయ విమర్శలు చేస్తూ ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం తప్ప. ప్రైవేట్ టీచర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్న కూడా వారి గురించి ఆలోచించే సమయం ప్రభుత్వానికి లేదు అని ఎన్నో రోజుల నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: