ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంతో వేగంగా కొనసాగుతోంది. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా వ్యాక్సిన్ అందించేందుకు ప్రస్తుతం కేంద్రం నిర్ణయించగా.. రాష్ర్ట ప్రభుత్వాలు కూడా ప్రణాళికబద్ధంగా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. అయితే కొన్ని ప్రాంతాలలో ఇప్పటికి కూడా ప్రజలు వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు రావడం లేదు. వ్యాక్సిన్ ఫై ఇంకా ఎన్నో అపోహలు పెట్టుకొని భయపడిపోతున్నారు.  ఇలాంటి సమయాల్లో వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు వచ్చే విధంగా కొన్ని ప్రాంతాలలో అధికారులు వినూత్నమైన ఆఫర్లు ప్రకటిస్తూ ఉండటం గమనార్హం.  వ్యాక్సిన్ వేసుకునే వారికి బహుమతులు అందించడం లాంటివి కూడా చేస్తున్నారు.




 ఇక ఇటీవలే తమిళనాడులోని కరూర్ జిల్లా యంత్రాంగం కూడా ఇలాంటి తరహా చర్యలు చేపట్టింది  రాష్ట్రంలో ఆదివారం రోజున మెగా డ్రైవ్ లో భాగంగా వ్యాక్సినేషన్  నిర్వహించాలని నిర్ణయించారు. ఒకవేళ ఈ మెగా డ్రైవ్లో టీకా వేసుకున్నారు అంటే మీరు భారీ బహుమతులు పొందవచ్చు. ఎందుకంటే ఈ మెగా డ్రైవ్ లో భాగంగా ఒక లక్కీ డ్రా కూడా ఏర్పాటు చేశారు. డ్రా ద్వారా తీసుకుని వారి పేర్లు చీటీలా రూపంలో తీసి విజేతలను ఎంపిక చేస్తారు. ఇక ఇలా విజేతలుగా నిలిచిన వారికి ఏకంగా వాషింగ్ మెషిన్, వెట్ గ్రైండర్,  మిక్సర్ గ్రైండర్ లాంటి ఎన్నో విలువైన బహుమతులను అందజేయనున్నట్లు తెలుస్తోం.ది ఇక ఈ విషయాన్ని ఏకంగా  జిల్లా కలెక్టర్ పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.




 రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతున్న మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా టీకా వేసుకున్న వారందరి పేర్లతో లక్కీ డ్రా నిర్వహిస్తామని లక్కీ డ్రా విజేతలకు విలువైన బహుమతులు అందజేస్తాము అంటూ జిల్లా కలెక్టర్ చెప్పుకొచ్చారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు వాషింగ్ మిషిన్, వెట్ గ్రైండర్,  మిక్సర్ గ్రైండర్ బహుమతులు ఇవ్వబోతున్నామని.. ఇలా ఏకంగా 100 ప్రోత్సాహక బహుమతులు అందించాలని నిర్ణయించాము అంటూ జిల్లా కలెక్టర్ చెప్పుకొచ్చారు. ఇక లబ్ధిదారులను తీసుకురావడంలో స్వచ్ఛందంగా పని చేసిన వారికి 5వేల రూపాయల ప్రోత్సాహకం కూడా అందించబోతున్నట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: