ఇకపోతే ఇటీవలే హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కావడంతో.. ఉప ఎన్నికలో పోటీ చేయాలి అనుకుంటున్నా ఎంతో మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకున్నారు. కాగా ఇప్పటికే హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రధానంగా పోటీ పడుతున్న బిజెపి టిఆర్ఎస్ పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఎంతో మంది ఇండిపెండెంట్లు కూడా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం. ఇకపోతే ఇటీవలే నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా.. ఎన్నికల సంఘం ఈ నామినేషన్లకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
అయితే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఒక్కరు కాదు ఏకంగా నలుగురు రాజేందర్ లు బరిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవల రాజేందర్ పేరుతో మొత్తం నలుగురు నామ పత్రాలను దాఖలు చేయడం గమనార్హం. అంతేకాదండోయ్ ఇక ఇలా నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన అందరి ఇంటిపేరు కూడా ఈ అనే అక్షరం తోనే మొదలు కావడం గమనార్హం. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ బరిలో ఉండగా.. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ఇమ్మడి రాజేందర్ నామినేషన్ దాఖలు చేశారు.. న్యూ ఇండియా పార్టీ తరఫున ఈసం పల్లి రాజేందర్ నామినేషన్ దాఖలు చేశారు. ఆల్ ఇండియా బి సి ఓ బి సి పార్టీ తరఫున ఇప్పుల రాజేందర్ నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. అయితే ఇలా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నలుగురు రాజేందర్ అనే పేరు ఉన్న వ్యక్తులు నామినేషన్ దాఖలు చేయడం వారి ఇంటి పేర్లు కూడా ఈ అనే అక్షరంతోనే మొదలు కావడంతో ఇది కేసీఆర్ ప్లాన్ అయి ఉంటుందా అని అందరూ అనుమాన పడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి