భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతమైన కాశ్మీర్లో ఎప్పుడు వాతావరణం హాట్ హాట్ గానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్ ఎప్పుడు ఉగ్రవాదులను భారత సరిహద్దు లోకి అక్రమంగా పంపించేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది.  ఇక సరిహద్దుల్లో పాకిస్తాన్ ఆర్మీ ఎప్పుడూ కాల్పులు జరిపి ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తూ ఉంటుంది.అయితే పాకిస్తాన్లో నెలకొన్న పరిస్థితులను అదుపులోకి తీసుకు వచ్చేందుకు కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఏకంగా కాశ్మీర్ లో అమలులో ఉన్న 370 ఆర్టికల్ రద్దు చేస్తూ నిర్ణయించింది. ఈ నిర్ణయం కాస్త అప్పట్లో పెను సంచలనమే సృష్టించింది అని చెప్పాలి  370 ఆర్టికల్ రద్దు నిర్ణయాన్ని అటు పాకిస్థాన్ తీవ్రంగా వ్యతిరేకించింది. చర్చలు జరపాలని డిమాండ్ చేసింది. కానీ భారత్ ప్రభుత్వం మాత్రం పాకిస్తాన్ తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా లేము. అయితే కొన్నాళ్ళ వరకు భారత ఆర్మీ తో కాశ్మీరు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేసింది కేంద్రం. ఇక ప్రస్తుతం కాశ్మీర్ లో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్న ఇలాంటి సమయంలో మళ్ళీ ఉగ్రవాదులు ఏదో ఒక విధంగా కాశ్మీర్లో అల్లకల్లోల పరిస్థితులు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు కాశ్మీర్లో ఉగ్ర కుట్ర కు ప్లాన్ చేసారు. కానీ భారత ఆర్మీ అప్రమత్తంగా ఉండటంతో చివరికి ఎలాంటి సంఘటనలు జరగలేదు. కాని గత కొంత కాలం నుంచి మరోసారి కాశ్మీర్లో ఉగ్రవాదులను తెర మీదకి తీసుకు రావడానికి పాకిస్తాన్ సిద్ధం అయినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదులు పలువురిని దారుణంగా కాల్చిచంపిన ఉండడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రజాస్వామ్యంలో బతుకుతున్న కాశ్మీర్ ప్రజలందరినీ కూడా చంపుతూ కేవలం పాకిస్తాన్ ప్రేమికులను కు మాత్రమే వదిలేయడానికి అటు సిద్ధమయ్యారు  ఉగ్రవాదులు. ఇక రానున్న రోజుల్లో ఇలా ప్రతి ఒక్కరిని కూడా తమ వైపు తిప్పుకునేందుకు   పాకిస్థాన్  ప్లాన్ చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: