టెక్నాలజీ పెరిగిపోయింది. ఏది కావాలన్నా అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో వాలిపోతుంది. అంతేకాదు ఏది దాచుకోవాలన్నా కూడా అటు గూగుల్ కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది అనే చెప్పాలి. నేటి రోజుల్లో ప్రతి మనిషి జీవితంలో గూగుల్ అనేది ఒక భాగంగా మారిపోయింది. గూగుల్ ప్రస్తుతం అనేక రకాల సేవలను అందిస్తుంది అన్న విషయం తెలిసిందే. సందేశాల కోసం జీమెయిల్, రూట్ మ్యాప్ కోసం జీ మ్యాప్స్, ముఖ్యమైన పత్రాలు భద్రపరచడం కోసం గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫొటోస్. ఆర్థికపరమైన లావాదేవీల కోసం గూగుల్ పే లాంటివి అందిస్తుంది. ఇలా మనకు సంబంధించిన డేటా మొత్తం దాదాపుగా గూగుల్ లోనే ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 ఇలా గూగుల్ లో ఉన్న మన డేటా మూడో కంటికి తెలియకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు కూడా తమకు నచ్చిన పాస్వర్డ్ పెట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇంత వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ ఒక వేళ ఆ మనిషి మరణిస్తే మాత్రం గూగుల్ లో ఉన్న వివరాల సంగతి ఏంటి? ఇక పాస్వర్డ్ అయితే దాదాపుగా ఎవరికీ తెలిసే అవకాశం ఉండదు మరి మనిషి మరణించిన తర్వాత ఆ అకౌంట్ ఏమవుతుంది ఆ డేటా మొత్తం గూగుల్ ఏం చేస్తుంది అన్న అనుమానం ఎవరికైనా కలిగిందా.. దాదాపు కొంతమందికి కలిగి ఉంటుంది అయితే ఇలాంటి విషయంలో కూడా అటు గూగుల్ దగ్గర పరిష్కారాలు ఉన్నాయట.



 వ్యక్తి మరణించడం వల్ల గూగుల్ అకౌంట్ నిరుపయోగంగా మారిపోతుంది   అయితే ఇలా ఎక్కువ కాలం వినియోగించకుండా ఉన్న అకౌంట్లోని గూగుల్ ఇన్ యాక్టివ్ అకౌంట్ గా మార్చేస్తుంది. ఇక ఈ  అకౌంట్కు సంబంధించిన డేటాను ఏం చేయాలనే దానిపై అటు రెండు రకాల ఆప్షన్లు కూడా ఇస్తుంది గూగుల్.  చనిపోయిన వ్యక్తి నచ్చిన వారికి తమ డేటాను ఇచ్చే అవకాశం ఇస్తుంది. http://myaccount.google.com/inactive అనే సైట్ లోకి వెళ్లి మీరు ఇలాంటి ఆప్షన్ ఎంచుకునేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ మరణించిన తర్వాత ఎంత కాలానికి అకౌంట్ ఇన్ యాక్టివ్ చేయాలి.. ఇక ఈ వివరాలను ఎవరికి అందించాలి అన్న విషయాలను కూడా ఇందులో నమోదు చేస్తే సరిపోతుంది. తర్వాత మీరు చెప్పిన ఆదేశాల మేరకు గూగుల్ మీ డేటాను మీరు చెప్పిన వ్యక్తి కి అందిస్తుంది. ఒకవేళ గూగుల్ అకౌంట్ అని ఎవరితో పంచుకోవడానికి ఇష్టం లేకపోతే దాని తర్వాత ఉన్న డేటాను పూర్తిగా శాశ్వతంగా డిలీట్ చేసే ఆప్షన్ కూడా అందిస్తుంది గూగుల్ .

మరింత సమాచారం తెలుసుకోండి: