సౌదీ అరేబియాను అనుసరిస్తామంటున్న మంత్రి ఎవరు ?

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు తమ జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలని భావిస్తారు.  అందు కోసం ప్రత్యేకంగా ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు. గత రెండు సంవత్సరాలుగా హజ్ యాత్ర పై కోవిడ్-19 ప్రభావం చూపింది.  హజ్-2022 కు సంబంధించి విధి విధానాల పై కేంద్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది.
సౌదీ అరేబియా ప్రభుత్వం నియమ నిబంధనలను అనుసరించి  హజ్ యాత్ర ఉంటుందని, లేక పోతే లేదని  కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్రీ పేర్కోన్నారు. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖను కూడా ఆయనే చూస్తున్నారు. శుక్రవారం ఆయన హజ్ - 2022 యాత్రకు సంబంధించి తన శాఖ అధికారుూలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కోవిడ్-19 ఇంకా  పూర్తి స్థాయిలో అదుపులోనికిరాక పోవడం, హజ్ యాత్రపై ప్రభావాన్ని చూపుతోందని తెలిపారు. భారతీ దేశంలో ని కోవిడ్ నిబంధనలు, సౌదీ అరోబియా దేశం అనుసరిస్తున్న కోవిడ్ నిబంధనలు అనుగుణంగా హజ్ యాత్ర ఉంటుందని  మంత్రి తెలిపారు. భారత దేశం సౌదీ అరేబియా  దేశం ఆచరిస్తున్న కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటుందని, ఈ విషయంలో ఆ దేశాన్ని అనుసరిస్తామని మంత్రి స్పష్టం చేశారు
హజ్-2022 యాత్రకు సబంధించి ఈ ఏడాది నవంబర్ తొలి వారం లో ఆన్ లైన్ ద్వారా ప్రయాణికుల  నమోదు ప్రక్రియ ఆరంభమవుతుందని తెలిపారు. ప్రయాణికులందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు అందజేస్తామని తెలిపారు. హజ్ యాత్రీకులందరికీ రవాణ, మక్కా, మదీనాలో వసతి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. హజ్-2022 లో యాత్రీకుల సమాచారాన్నంతటినీ డిజిటలైజ్ చేస్తామని తెలిపారు. అన్నీ అనుకూలిస్తే ఈ ఏడాది యాత్ర నిరాటంకంగా సాగుతుందని  ఆయన ఆశా భావం వ్యక్తం చేశారు.  ప్రపంచంలో హజ్ యాత్ర చేస్తున్నదేశాల్లో భారత్  రెండవ స్థానంలో నిలుస్తోందని కేంద్ర మంత్రి చెప్పారు.
2020, తోపాటు 2021లో హజ్ యాత్ర కోసం మూడు వేల మంది ముస్లిం మహిళలు దరఖాస్తు చేసుకున్నారని కేంద్ర మంత్రి తెలిపారు.  అయితే వారంతా  ఒంటరిగానే వెళ్లాలని కోరారన్నారు. హజ్-2022 లో వారికి తొలి ప్రాధాన్యం కల్పిస్తామని నక్రీ ప్రకటించారు. ఆ తరువాత మిగిలిన వారికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.

కాగా హజ్ యాత్ర వివిధ ప్రభుత్వ విభాగాలు, ఆయా  మంత్రిత్వ శాఖల సంయుక్త కార్యాచరణపై ఆధారపడి ఉంటుంది. ఇందులో కేంద్ర అరోగ్య శాఖ, హోం శాఖ,  పౌర విమాన యాన శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ, తో పాటు హజ్ కమిటీ, భారత ప్రభుత్వ రాయభారి,  సౌదీ రాయభార కార్యాలయం సిబ్బంది సంయుక్తంగా పనిచేయాల్సి ఉంటుంది.  ముఖ్యంగా కఠినమైన  సౌదీ అరోబియా కోవిడ్-19 నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: