భారతదేశం తన పరిపాలనా విధానంలో  ప్రజాస్వామ్య పద్ధతి ని ఎన్నుకున్నందున స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలకు పెద్దపీట వేసే గురుతర బాధ్యత పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ఉండితీరాలి. అప్పుడే ఆ దేశ ప్రజలకు ప్రజాస్వామ్య ఫలాలు రాజ్యాంగబద్ధంగా అందుతాయి. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా దేశ ఔన్నత్యాన్ని కాపాడుతూనే మానవ అభివృద్ధి సాధిస్తూ ప్రజలను కన్నబిడ్డలవలె కాపాడే పద్ధతిలో పాలించడానికి సిద్ధపడాలి. ఏ పార్టీ ఎప్పుడైనా అధికారంలోకి రావచ్చు. అధికారంలో ఉన్న పార్టీ మాత్రమే తిరిగి తిరిగి అధికారంలోకి వస్తుందని నమ్మకం లేదు. కారణం అధికార పక్షం యొక్క అవినీతి, ఆశ్రిత పక్షపాతం, ఆధిపత్యం, అహంకారాన్ని ప్రజలు గమనిస్తూ ఉంటారు. అవసరమైతే ఎన్నికల్లో గుణపాఠం చెబుతారు. అలాంటప్పుడు ఈ గుణపాఠం మిగతా పార్టీలకు కూడా వర్తిస్తుంది. ఆ సోయి ఆలోచన అన్ని రాజకీయ పార్టీలకు ఉంటేనే ప్రజల అండదండలు ఆదరణ లభిస్తాయి.

   సామాజిక బాధ్యత విస్మరిస్తున్న ప్రతిపక్షాలు:
      ఇవాళ దేశవ్యాప్తంగా గాని అనేక రాష్ట్రాలలోనూ విద్యా, వైద్య రంగం పూర్తిగా ప్రైవేటు ఆధీనంలో కొనసాగుతున్నది. ఢిల్లీ కేరళ వంటి కొన్ని రాష్ట్రాలలో మాత్రమే ప్రభుత్వ రంగంలో కొనసాగుతూ నాణ్యమైన విద్య వైద్యం అందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా అలాంటి విధానాన్ని అమలు చేయడానికి ప్రతిపక్షాలు ఎందుకు పార్లమెంట్లో నిలదీయడం లేదు..?. భారతదేశంలో కేవలం గుజరాత్ లో మాత్రమే మద్యపానం నిషేధించబడినది. పొరుగు రాష్ట్రాల్లో అమల్లో లేదు కనుక  అక్రమ రవాణా తో నిషేధము విఫలమవుతుంది. ప్రజల ఆరోగ్యాన్ని యువశక్తిని పట్టించుకున్నట్లు అయితే ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా మద్యపాన నిషేధానికి ఉద్యమించాలి .ఏనాడైనా ఆలోచించారా..? కల్తీ మందులు, అశ్లీల టీవీ సీరియల్స్ సినిమా సెల్ ఫోన్ నీలి చిత్రాలు, ఆహార పదార్థాలలో కల్తీ, రాజకీయ ఉద్యోగిస్వామ్యం లో విపరీతమైన అవినీతి,
 వివక్షత ,అసమానతలు, అంతరాలు ప్రతిపక్షాలకు కనిపించడం లేదా? 73 శాతం సంపద కేవలం ఒక శాతంగా ఉన్న సంపన్నవర్గాల చేతిలో ఉంటే ఈ దేశంలో సామ్యవాద తరహా ప్రభుత్వం అని రాజ్యాంగంలో రాసుకుంటే సరిపోతుందా?
 20 శాతం దారిద్ర్య రేఖ దిగువన ఉంటే మరో 20 శాతం సంచార వలస కార్మికులు ఈ దేశంలో అష్ట కష్టాలు పడుతుంటే ప్రజల సమస్యలు పట్టించుకోని రాజకీయ పార్టీలు ప్రతిపక్షాలు తమ పబ్బం గడుపు కోవడా నికి ఉనికి కోసం మాత్రమే కొనసాగితే ప్రయోజనం ఏమీ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: