కరోనా వైరస్.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ మహమ్మారి ఇప్పట్లో ప్రపంచాన్ని వదిలేలా కనిపించడం లేదు.  చైనా నుంచి ప్రపంచానికి పాకిపోయిన ఈ మహమ్మారి వైరస్ ప్రపంచ దేశాలను మొత్తం పట్టి పీడిస్తూనే ఉంది  అయితే ఈ వైరస్ను పూర్తిగా ఎదుర్కొనేందుకు ఇప్పటికే ప్రపంచ దేశాలు మొత్తం సిద్ధమయ్యాయి. ప్రస్తుతం అన్ని దేశాలలో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంతో వేగంగా కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో దాదాపు అన్ని దేశాలలో కూడా మొన్నటి వరకు కరోనా వైరస్ కేసుల సంఖ్య చాలా తక్కువగానే ఉంది   కానీ ప్రస్తుతం మళ్లీ అగ్రరాజ్యాల లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయ్.



 దీంతో ప్రపంచ దేశాలు మరోసారి భయపడుతున్నాయి. ఎక్కడ అన్ని దేశాలకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందోనని ఆందోళన చెందుతున్నాయి. వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాత కూడా  వైరస్ కంట్రోల్ కాకపోతే ఎలా అంటూ అందరూ ఆందోళనలో మునిగిపోతున్నారు   మొన్నటి వరకు బ్రిటన్లో  వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరగడంతో ఎత్తి వేసిన ఆంక్షలు అమలులోకి తీసుకువచ్చింది అక్కడి ప్రభుత్వం.  ఇప్పుడు రష్యా లో కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అన్నది తెలుస్తుంది. ఇటీవలే రష్యాలో ఒకే రోజు  1028 మరణాలు సంభవించాయి.



 దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఏకంగా వారం రోజులపాటు పూర్తిస్థాయి లాక్డౌన్ విధించింది రష్యా ప్రభుత్వం. ఎవరు కూడా కనీసం ఇంటి నుంచి కాలు బయట పెట్ట వద్దు అంటూ కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకువచ్చింది. అయితే రష్యాలో ఈ పరిస్థితికి కారణం ప్రభుత్వమే అంటూ చెబుతున్నారు విశ్లేషకులు. ఎందుకంటే వ్యాక్సిన్ విషయంలో ప్రజలకు ప్రభుత్వం అవగాహన కల్పించకపోవడం.. ఎవరికి వారు డబ్బులు పెట్టుకుని వ్యాక్సిన్ వేయించుకోవాలి అంటూ చెప్పడంతో ఇక రష్యాలో దాదాపుగా 70 శాతం మంది వ్యాక్సిన్ వేసుకోడానికి ముందుకు రాలేదు. ఇలా వ్యాక్సిన్ వేసుకోకపోవడమే ఇక ఇప్పుడు చైనా కు శాపంగా మారిపోతుంది ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకు వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: