భారత్ కి పాకిస్థాన్ చిరకాల శత్రువుగా కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఎన్నో దశాబ్దాల నుంచీ ఈ రెండు దేశాల మధ్య కూడా శత్రుత్వం కొనసాగుతుంది. అందుకే భారత్ పాకిస్థాన్ సరిహద్దుల్లో ఎప్పుడు  వాతావరణం హాట్ హాట్ గానే ఉంటుంది. ముఖ్యంగా భారత్ నుంచి కొంత కాశ్మీరు భాగాన్ని ఆక్రమించుకుని దానికి పిఓకే అని పేరు పెట్టింది పాకిస్తాన్.  అదే సమయంలో ఉన్న ఇండియా కాశ్మీర్  భూభాగంలో కూడా ఎన్నో ఉద్రిక్త పరిస్థితులను సృష్టించేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఉగ్రవాదులను భారత్ సరిహద్దుల్లోకి ఉసిగొల్పడం.. సరిహద్దుల్లో సైనికులతో కాల్పులు జరిపించటం లాంటివి చేసి సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మార్చేస్తూ ఉంటుంది పాకిస్తాన్.



 ఇక ఎప్పుడూ భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక తరచూ భారత్ పాకిస్తాన్ మధ్య ప్రపంచానికి తెలిసిన చిన్నపాటి యుద్ధమే జరుగుతూ ఉంటుంది. అంతేకాదు ఇక అటు పాకిస్థాన్ భారత్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది.  అయితే ఇటీవల పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ భారత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టి 20 క్రికెట్ మ్యాచ్లో పాకిస్థాన్ జట్టు విజయం సాధించిన తరుణంలో ఇక భారత్తో సంబంధాలు పై ఇప్పుడు చర్చించటం సరికాదంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడూ.



 సౌదీ అరేబియా రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు మూడు రోజుల పాటు ఆ దేశంలో పర్యటించిన ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్న సమస్య ఒక్కటే. పరిష్కరించుకోవాల్సింది కూడా అదే.. ఆ సమస్య ఏదో కాదు కాశ్మీర్ అంశం. కాశ్మీర్ ప్రజల మానవ హక్కులకు విషయం ఐరాస భద్రతా మండలి హామీ ఇచ్చిన మేరకు ఈ హక్కులు వారికి దఖలు పెడితే చాలు ఇక భారత్ పాకిస్తాన్ మధ్య ఇంకా వేరే సమస్యలు ఏమీ లేవు. చైనాతో ఇప్పటికే తమ దేశానికి మంచి సంబంధాలు ఉన్నాయి. భారత్తో కూడా సంబంధాలు మెరుగు పెడితే బాగుంటుంది. ఇలాంటి సంబంధాలు మెరుగు పెడితే పాకిస్థాన్ మీదుగా మధ్య ఆసియా ప్రాంతంలోకి భారత్ ఎంతో సులభంగా చేరుకునే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ కి పెద్ద మార్కెట్ లో చేరువ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అంటూ ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: