జగన్ ఒక మంచి లక్ష్యంతో ఉద్దేశ్యంతో పాదయాత్ర మొదలు పెట్టిన సంగతి అందరికీ తెలుసు. దానికి ప్రజలే సరైన తీర్పు ఇచ్చారు. ఆ తర్వాత 2019 లో జరిగిన ఎలక్షన్ లో చరిత్రలో గుర్తుండిపోయే విజయాన్ని అందించారు. జగన్ ఒకే ఒక నినాదంతో పాదయాత్రలో సక్సెస్ అయ్యారు. "నేనున్నాను నేను విన్నాను" కానీ ఈ మాట విన్నా చాలా మంది ప్రజలు ఎప్పటి లాగే ఒక రాజకీయ నాయకుడు ఓట్ల కోసం మనల్ని నమ్మబలుకుతున్నాడు అని భావించారు. ఆ తర్వాత గానీ వారికి తెలిసి రాలేదు.. కాదు మనము అనుకుంది చాలా పొరపాటు అని, చెప్పిన ప్రతి ఒక్క మాటను.. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవడానికి ఈ రోజు జగన్ పడే కష్టం చూస్తే ఎవరికైనా ఇట్టే అర్ధమవుతుంది. జగన్ చూసిన ప్రతి సమస్యను పరిష్కరించడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు.

అయితే పాలన ఆరంభం అయిన నాటి నుండి నేటి వరకు జగన్ పై ప్రజలు చూపిస్తున్న ప్రేమకు అభిమానానికి అసూయ పడి ప్రజల్లో ప్రభుత్వానికి వ్యతిరేక భావన కలిగేలా ప్రేరేపిస్తున్నారు. ప్రతిపక్షం అయిన టీడీపీ మొదటి నుడ్ని ప్రభుత్వం చేసిన ఏ పనినీ సమర్ధించకపోగా అందులో తప్పులు వెతుకుతూ ప్రజల్లో ఇంకా చులకనగా మారిపోతున్నారు. కానీ కొన్ని విషయాలలో మాత్రం ప్రజలు ప్రభుత్వం వ్యతిరేకముగానే ఉన్నారన్నది వాస్తవం. ఇందు కోసం జగన్ మళ్ళీ ప్రజల్లోకి వెల్లాలనే ప్రణాళికలో ఉన్నారు. నా ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అన్నది స్వయంగా తెలుసుకోవడానికి అతి త్వరలోనే మళ్ళీ ప్రజల వద్దకు వెళ్లనున్నారు.

మరి గడిచిన ఈ మూడేళ్ళ పాలనలో జగన్ వారిని మెప్పించాడా? లేదా నొప్పించాడా? అన్నది జగన్ కే తెలుస్తుంది. దీనిని బట్టి వచ్చే ఎన్నికలకు ప్రజలు జగన్ వైపు ఉన్నారా లేదా అన్నది కూడా తెలిసిపోనుంది.    

మరింత సమాచారం తెలుసుకోండి: