తెలంగాణలో ప్రభుత్వానికి వచ్చే ఎక్కువ ఆదాయం మద్యం అమ్మకాల ద్వారా  వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అటు తెలంగాణ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇక  మద్యం దుకాణాల విషయంలో కొన్నేళ్ల నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. అమ్మకాలను దృష్టిలో పెట్టుకుని మద్యం షాపుల సంఖ్య కూడా పెంచుతు పోతుంది అన్న విషయం తెలిసిందే.. ఇకపోతే తెలంగాణలో మరికొన్ని రోజుల్లో కొత్త మద్యం పాలసీ అందుబాటులోకి రాబోతోంది. ఇక ఈ కొత్త మద్యం పాలసీ లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్నది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.



 అయితే ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ విషయంలో మందుబాబులకు కిక్కిచ్చే వార్త ఏమైనా చెప్పబోతుందా అని అటు మందు బాబులు కూడా వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి. అయితే ఇప్పటికీ పాత మద్యం పాలసీ గడువు పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ కరోనా వైరస్ కారణంగా మద్యం షాపులు మూతపడడంతో ఇక ఒక నెల పాటు మద్యం పాలసీ గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఇక కొత్త మద్యం పాలసీ మరికొన్ని రోజుల్లో అమలు కాబోతున్న నేపథ్యంలో ఇక ఎక్సైజ్ అధికారులు ప్రస్తుతం ఈ విషయమై చర్చలు జరుపుతున్నారు.



 ఇకపోతే ఇందులో భాగంగానే ఎక్సైజ్ అధికారులతో ఆ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. నూతన మద్యం విధానం ఎలా ఉండాలి అనే దానిపై సుదీర్ఘంగా చర్చించారట. అంతే  కాదు కొత్తగా అనుమతించే మద్యం దుకాణాల పై కూడా పలు సూచనలు సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2216 మద్యం దుకాణాలు ఉన్నాయి. అయితే ఇక మద్యం కొత్త పాలసీ లో భాగంగా అదనంగా మరో 350 మద్యం దుకాణాలు అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండేళ్ల కాలంలో మద్యం అమ్మకాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ డిమాండ్ ఎక్కువగా ఉంటే అక్కడ కొత్త మద్యం దుకాణాలు తీసుకువచ్చే అవకాశం ఉంది అని టాక్ వినిపిస్తుంది. ఇది మందుబాబులు అందరికీ కిక్ ఇచ్చే వార్త అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: