గత కొన్ని రోజుల నుంచి సజ్జనార్ తీసుకుంటున్న ఎన్నో నిర్ణయాలు సంచలనంగా మారిపోతున్నాయి అని చెప్పాలి. ఒకవైపు నష్టాల్లో ఉన్న సంస్థను గాడిలో పెట్టడమే కాదు ఇక ఆర్టీసీ సంస్థను ప్రజలకు మరింత దగ్గర చేసేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు టిఎస్ ఆర్టిసి ఎండి సజ్జనార్. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టారు అన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సంచలన నిర్ణయం తీసుకొని రైతులందరికీ గుడ్ న్యూస్ చెప్పారు. మొన్నటి వరకు రైతులు పండించిన పంటను మార్కెట్కు తరలించేందుకు కార్గో సర్వీసులు అందుబాటులో ఉండేవి.
కానీ పూర్తిస్థాయిలో కార్గో సదుపాయం రైతులకు ఉపయోగకరంగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు కార్గో సర్వీసుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు ఆర్టిసి ఎండి సజ్జనార్. ఇందులో భాగంగానే రైతుల పంట ఉత్పత్తులను కల్లాల నుంచి నేరుగా మార్కెట్కు రవాణా చేసేందుకు నిర్ణయించారు. తక్కువ ఖర్చు కావడం తో రైతులకు కూడా ఇక ఈ కార్గో సర్వీస్ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే సరసమైన ధరలకు రైతులకు రవాణా సదుపాయం ఇస్తున్నాం. టీఎస్ఆర్టీసీ రైతు నేస్తం అనే పేరుతో ఇక ఈ సర్వీసును ప్రారంభించారూ. రైతే రాజు, అన్నదాత సుఖీభవ,జై జవాన్, జై కిసాన్ అంటూ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు పెట్టారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి