ప్రపంచ దేశాలన్నింటికీ కూడా ఆ దేశం పెద్దన్న లాంటిది. ఎలాంటి సమస్య వచ్చినా ఆదుకుంటుంది అన్న భరోసా వుంటుంది. ఆ దేశంలో ఉద్యోగం వస్తే చాలు అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అని చెప్పాలి. ఇక ఆ దేశ సైన్యం విషయానికి వస్తే.. ప్రపంచం మొత్తం ఆ దేశ సైనికులు తలచుకుంటే గడగడ లాడించే పోతూ ఉంటుంది. కానీ ఇప్పుడు అగ్రరాజ్యమైన అమెరికా లోనే సైనికులకు ఆకలి బాధలు తప్పడం లేదు అన్నది అర్ధమవుతుంది. అగ్రరాజ్యంలో ఆకలి కేకలు ఏంటిఅని ఆశ్చర్యపోతున్నా.. వినడానికి నమ్మశక్యంగా లేకున్నా.. ఇదే నిజం.


 ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒక్క లక్ష అరవై వేల మంది సైనిక కుటుంబాలు కరోనా వైరస్ కారణంగా కుటుంబాన్ని పోషించలేని స్థితి లోకి వెళ్లి పోవడం గమనార్హం. ఇటీవల నిర్వహించిన సర్వేలో ఈ నమ్మలేని నిజం బయటపడింది. ఫీడింగ్ అమెరికా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. కరోనా వైరస్ దెబ్బకు అటు అమెరికా సైనికుల కుటుంబాల మొత్తం అయోమయంలో పడిపోయాయి. దిగువ స్థాయిలో పని చేస్తే సైనికుల జీతాలు కుటుంబ పోషణకు అసలు సరిపోవటం లేదట. ఒకప్పుడు కుటుంబ పోషణలో చేదోడు వాదోడుగా ఉంటూ ఎంతోమంది సైనికుల భార్యలు కూడా కరోనా వైరస్ కారణంగా ఉద్యోగం కోల్పోయారట.




 దీంతో ఏకంగా ఒక లక్షా 60వేలమంది కుటుంబాలలో కనీసం మూడు పూటలా తినలేని పరిస్థితి నెలకొంది అనే విషయం ఫీడింగ్ అమెరికా సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అయితే ఇలాంటి ఒక చేదు వాస్తవం దాదాపుగా అమెరికన్లకు తెలియకపోవచ్చు. కానీ సైన్యంలో పనిచేస్తున్న చాలా మంది సైనికులకు ఈ విషయం తెలిసే ఉంటుంది. ప్రపంచంలోనే అతి శక్తివంతమైన సైన్యంలో మేము భాగస్వాములం.. కానీ మా కుటుంబాలకు తిండి పెట్టలేక పోతున్నాము.. ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని కాపాడడానికి ఎలా ఉద్యోగం చేయగలము అంటూ ఇరాక్ యుద్ధంలో రెండు కాళ్లు కోల్పోయిన పైలెట్ టేమి డక్వర్త్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సైన్యం లోకి వెళ్ళిన తర్వాత వేరొకరిని తిండి కోసం సహాయం అడగటం ఎంతో అగౌరవంగా ఉంటుందని అందుకే ఎంతోమంది తిండి దొరక్క పోయినప్పటికీ పస్తులు ఉంటున్నారు ఈ సంస్థ సర్వేలో వెల్లడైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: