దేశంలో పలు రాష్ట్రాలలో మళ్లీ కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతూ ఉన్నాయి. ఇటు ఆంధ్ర రాష్ట్రంలోనూ మళ్లీ పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో మొత్తం 264 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కాగా 247 మంది కరోనా నుండి కోలుకున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. అయితే ఇంకా సంతోషించాల్సిన విషయం ఏమిటంటే గతంలో లక్షల్లో ఉన్న యాక్టివ్ కేసులు సంఖ్య ఇప్పుడు వేలల్లోకి వచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 2 వేల 175 గా ఉన్నట్లు తాజాగా విడుదలైన కరోనా హెల్త్ బులెట్ ద్వారా తెలిపింది వైద్యారోగ్యశాఖ. ప్రస్తుతం అంతగా భయపడాల్సిన అవసరం లేనప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మాత్రం చాలానే ఉంది.
 
ఇప్పటి పరిస్థితులు ఒకరకంగా బాగానే ఉన్నప్పటికీ జనవరిలో ప్రమాదం పొంచి ఉందని మళ్లీ కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. అందరూ వ్యాక్సిన్లు బూస్టర్ డోస్ లు వేసుకుని పలు కరోనా జాగ్రత్తలు మరి కొన్నాళ్లు పాటించడం వలన ఈ ప్రమాదం నుండి తప్పించుకోవచ్చు అని సూచిస్తున్నారు. అదే కాకుండా ప్రస్తుతం డెల్టా వేరియంట్ ఉంది. థర్డ్ వేవ్ లో ఇది మరింత విజృంభించే అవకాశం ఉంది, అయితే ఇది చాలా ప్రమాదకరం కాబట్టి ప్రజలు జాగృతం కావాలి. వైద్య నిపుణులు మరియు సదరు శాస్త్రజ్ఞుల సలహాలు సూచనలు పాటిస్తూ కరోనా దరి చేరకుండా చూసుకోవాలి.

కొందరు ప్రజానీకం నిత్యం కరోనా గురించిన వార్తలను సోషల్ మీడియాలోనూ టీవీ లోనూ చూస్తూ నిర్లక్ష్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి వారు అందరూ ఒక విషయం గుర్తుంచుకోవాలి. కరోనా సోకిన తర్వాత ప్రాణభయంతో బాధపడడం కన్నా ఇప్పుడే దానిని రాకుండా చేసుకుని జాగ్రత్తగా ఉండడం మంచిదని అభిప్రాయం. అందుకు తగ్గట్టుగా ఇప్పటి నుండే ప్రభుత్వాలు సైతం అన్ని అవసరమయిన వనరులను సిద్ధంగా ఉంచుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: