సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచ దేశాలలో ఎక్కడో జరిగిన ఘటనలు కూడా క్షణాల్లో  అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో వాలి పోతున్నాయి. దీంతో అన్ని రకాల సమాచారాన్ని తెలుసుకోగలుగుతున్నారు ప్రతి ఒక్కరు. కానీ సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ వెలుగులోకి వస్తున్న చిత్రవిచిత్రమైన ఘటనలు మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల కాలంలో పెంపుడు జంతువులుగా కుక్కలను ఎక్కువమంది పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. కొంతమంది అయితే మనుషుల కంటే ఎక్కువగా జంతువులనే ప్రేమిస్తున్నారు. ఇక మరి కొంతమంది ఏకంగా మనుషులను వదిలేసి కుక్కల పెళ్లి చేసుకోవడం కూడా చేస్తున్నారు. ఇక్కడ ఒక మహిళ ఇలాంటిదే చేసింది.


 ఏకంగా కట్టుకున్న భర్తకు విడాకులు ఇచ్చి ఒక కుక్క ను వివాహం చేసుకుంది మహిళ. ఈ ఘటన లండన్ లో వెలుగులోకి వచ్చింది. భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు ఒంటరిగా నే గడిపిన సదరు మహిళ ఇటీవల పెంపుడు కుక్క తో ప్రేమలో పడి చివరికి వివాహం కూడా చేసుకుంది. లండన్ కి చెందిన అమాందా రోడ్జర్  అనే 47 ఏళ్ల మహిళ ఇటీవల భర్తకు విడాకులు ఇచ్చింది. ఇక ఆ తర్వాత ఒంటరిగా ఉండటం తో తనతో ఉన్న పెంపుడు జంతువును అమితంగా ప్రేమించడం మొదలు పెట్టింది. ఆ మహిళ వద్ద ఉన్న పెంపుడు కుక్క పేరు షేబా.


 ఇక ఆ తర్వాత ఏకంగా కుక్కను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. మనుషులు చూపించే ప్రేమ కంటే కుక్క ఎంతో స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తోందని.. అందుకే కుక్కనూ తన భాగస్వామిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అంటూ సదరు మహిళ చెప్పుకొచ్చింది. మోకాళ్లపై నిలబడి తన పెంపుడు కుక్క కు ప్రపోజ్ చేస్తే అది కూడా తోక ఊపి అంగీకారం తెలిపిందట. ఇలా సదరు మహిళ ఏకంగా ఇక కుక్క తో పెళ్లికి రెండు వందల మంది బంధువులను కూడా పిలిచిందట. అయితే ప్రస్తుతం శంషాబాద్లో పెళ్లి తర్వాత ఎంతో సంతోషంగా ఉన్నానని.. కానీ తమ ప్రేమను చుట్టుపక్కలవారు వింతగా చూస్తారనితెలిపింది. ఇలా ఈ మహిళా కుక్క ని పెళ్లి చేసుకోవడం మాత్రం చుట్టుపక్కల అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: