2019 లో చైనా దేశం వుహన్ నగరం నుండి ప్రపంచ దేశాలకు విస్తరించిన కరోనా వైరస్ సృష్టించిన ప్రళయం తలుచుకుంటేనే ప్రాణం ఎంత విలువైనదో తెలుస్తుంది. దాదాపు రెండు సంవత్సరాలు విడతల వారీగా సమస్త ప్రపంచాన్ని అష్టకష్టాలు పెట్టింది. గత కొంతకాలం కేసులు బాగా తగ్గి అంతా సర్దుకుంది అనుకున్నారు. ఎప్పటి లాగే అంతా ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు. కానీ కొన్ని రోజులుగా మూడవ వేరియంట్ కు సంబంధించిన వార్తలు మళ్లీ భారత ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. సౌత్ ఆఫ్రికాలో పుట్టిన కొత్త వేరియంట్ ఓమిక్రాన్ భారత్ లో ప్రవేశించినట్లు తెలుస్తోంది.

సౌత్ ఆఫ్రికా నుండి బయలు దేరిన ఒక ఫ్లైట్ లో మొత్తం 60 మంది ప్రయాణికులు భారత్ కు వచ్చినట్లు సమాచారం. వారిలో ఇద్దరి ప్రయాణికులలో ఈ ఓమిక్రాన్ వేరియంట్ ను గుర్తించినట్లు ఉబ్బడి ముబ్బడిగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు వింటున్న భారతీయ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఈ వార్తలు విని కంగారు పడొద్దు అని ఒక వైపు ప్రభుత్వం మరోవైపు డాక్టర్స్ దైర్యంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇంతకు ముందు చాలా సార్లు చెప్పినట్లుగా కరోనా అనేది ఎప్పుడూ మన మధ్యనే ఉంటుంది. దాని వలన మనకు నష్టం ఎంత అనేది మనం తీసుకునే జాగ్రత్తల మీదనే ఆధారపడి ఉంటుంది.

ఇంతకు ముందు లాగే ఇప్పుడు కూడా కరోనా కోసం తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కరోనా నుండి మనల్ని రక్షించే మాస్క్, సామాజిక దూరం మరియు శానిటైజర్ ను వాడడం పట్ల నిర్లక్ష్యం చేయొద్దు. గత పరిస్థితులు ఎదురు కాకుండా ఉండాలంటే ప్రభుత్వం కూడా అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ప్రజలకు సానుకూలమైన జాగ్రత్తలు చెబుతూ ఉండాలి. వీలైనన్ని ఎక్కువ టెస్ట్ లు చేయిస్తూ పరిస్థితిని సమీక్షిస్తూ ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: