అప్పుల ఊబిలో కూరుకుపోయి... ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకు వచ్చిన  పథకం వన్ టైం సెటిల్ మెంట్ (ఓటిఎస్). ఈ పథకంపై దుష్ప్రచారం తగదని సాక్షాత్తు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కోన్నారు. అంతే కాదు దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించారు కూడా. ఇంతకీ ఏమిటీ పథకం.?
ఆంధ్ర ప్రదేశ్ లో చాలా కాలం నుంచి గృహ నిర్మాణాల పథకాలు అమలవుతున్నాయి. ఇళ్లు నిర్మించుకునే నిమిత్తం లక్షల సంఖ్యలో లబ్ది దారులు ప్రభుత్వం ద్వారా రుణాలు తీసుకుని ఉన్నారు.
 కారణాలు ఏవైనా లబ్ది దారులు తాము తీసుకున్నరుణాలను సకాలంలో చెల్లించ లేదు. దీంతో బకాయిలు పేరుకు పోయాయి. అధికారిక లెక్కల ప్రకారం దాదాపు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు బాకీ ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ బాకాయిలను రాబట్టుకునేందుకు ఆంధ్ర  ప్రదేశ్ ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రవేశ పెట్టింది. అదే ఓటిఎస్ పథకం. ఈ పథకాన్ని ప్రాంతాల వారీగా వర్గీకరించారు. గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతం, నగర ప్రాంతంగా నిర్ణయించారు. అంతే కాదు లబ్దిదారుల్లో కూడ పై విధమైన వర్గీకరణ ఉంది. నిర్దేశించిన నియమావళి ప్రకారం రుణంతో పాటు దానిపై వడ్డి ఎంత మేరకు పేరుకు పోయి ఉన్నా కూడా  అధికాయ యంత్రాంగం సూచించిన మొత్తాన్ని చెల్లిస్తే వారికి  క్లియరెన్స్ సర్టిఫికేట్ అందిస్తారు. అంతే కాకుండా  రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా అందజేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం  ఏ ప్రాంతానికి ఎంత అన్న విధానంలో కాకుండా రాష్ట్రం అంతా ఒక యూనిట్ గా తీసుకుంది నగర పాలక సంస్థల్లో ఇరవై వేల రూపాయలు, పట్టణ ప్రాంతాలలో పదిహేను వేల రూపాయలు, అదే విధంగా గ్రామీణ ప్రాంతాలలో పదివేల రూపాయలు చెల్లించి బకాయిలను పూర్తి చేయవచ్చు.   క్లియరెన్స్ సర్టిఫికేట్ పొందిన వారికి  నవంబర్ 8 నుంచి  రిజిస్ట్రేషన్లు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు  ప్రభుత్వం ఈ మేరకు టార్గెట్ విధించింది. ఇది కాస్తా వివాదాస్పదంగా మారింది. ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలో ఉన్న వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా  విమర్శలకు దిగే రాజకీయ పార్టీలు సహజంగానే  తమ నిరసను వ్యక్తం చేశాయి.
రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం పొందిన వారి జాబితా  చాలా పెద్దదిగా ఉంది. 1983 నుంచి 2011 వరకూ గృహనిర్మాణ సంస్థకు రావలసిన బాయిల మొత్తం విలువ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు పైమాటే. ఈ పథకం అమలైతే దాదాపు పదివేల కోట్ల  రుణ మాఫీ అవుతుందని ఆంధ్ర ప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ లో చిట్టచివరగా 2014లో ఈ పథకం అమలైందని ఆయన అన్నారు. గృహనిర్మాణ శాఖ లో ఓటిఎస్ అమలు చేయాలని చాలా కాలంగా వినతులు వస్తున్నాయని తెలిపారు. 2016లోనే ఈ పథకం అమలు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. అప్పటి నుంచి ఈ ఫైల్ పెండింగ్ లోనే ఉండిందని, ఇప్పటికి మోక్షం లభించిందని అజయ్ జైన్ వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ots