కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రక్షణ రంగాన్ని మరింత పటిష్టవంతంగా మార్చేందుకు ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇక రక్షణ రంగంలో కూడా స్వయం సమృద్ధి సాధించే దిశగాఇప్పటికే అడుగులు వేయడం ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే బడ్జెట్లో రక్షణ రంగానికి భారీగా నిధులు కేటాయిస్తూ ఉండటం గమనార్హం. అయితే మొన్నటి వరకూ సరిహద్దుల్లో సరైన మౌలిక సదుపాయాలు లేక భారత సైనికులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఇబ్బందులు ఎదురైనప్పటికీ అటు సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పహారా కాసే వారు. ఇప్పుడు సైనికులకు సరిహద్దుల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.


 దీని కోసం భారీగా నిధులు కూడా ఖర్చు పెడుతూ ఉండటం గమనార్హం. అదే సమయంలో వినూత్నమైన ఆయుధాలను కూడా భారత అమ్ములపొదిలో చేర్చుతుంది. వివిధ దేశాల నుంచి కొనుగోలు చేయడమే కాదు స్వదేశీ ఆయుధాలను సైతం అభివృద్ధి చేస్తూ ఉండటం గమనార్హం. ఇలా త్రివిధ దళాలను కూడా ఎంతో శక్తివంతంగా మార్చుకుంటుంది భారత్. అయితే ప్రస్తుతం సరిహద్దుల్లో పహారా కాస్తున్న సైనికులకు ఎంతో నాణ్యమైన దుస్తువులు సహా వివిధ రకాల వస్తువులు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే భారీగా నిధులు ఖర్చు పెడుతుంది అన్న విషయం తెలిసిందే.


 ఇక ఇప్పుడు సరిహద్దుల్లో పహారా కాసే సైనికుల యూనిఫామ్  విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధ క్షేత్రాల్లో సైనికులకు మరింత తేలికైన మన్నికైన యూనిఫామ్ సిద్దం అయినట్లు తెలుస్తోంది. వేసవి చలికాలంలో సైనికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎంతో సౌకర్యవంతంగా ఉండే విధంగా ఈ కొత్త యూనిఫామ్ తయారు చేశారట. మంచు, అటవీ ప్రాంతాల పరిసర రంగులలో కలిసిపోయే విధంగా ఉండే రంగులను యూనిఫామ్ కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీంతో కొంచెం దూరం నుంచి కనిపించిన కూడా పసిగట్టలేని విధంగా కొత్త రంగులో యూనిఫాంలో అందుబాటులోకి తీసుకువచ్చారు  వచ్చే ఏడాది జనవరి 15వ తేదీన జరగబోయే పెరేడ్ లో ఇక ఈ కొత్త యూనిఫామ్ ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: