ఇకపోతే ఇటీవలే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా గగన్ యాన్ అనే ప్రాజెక్టు చేపట్టింది. అయితే ఈ ప్రాజెక్టులో పాల్గొనబోయే వ్యోమగాములు అందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తుంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. ఈ క్రమంలోనే వ్యోమగాములకు అంతరిక్షంలో తినేందుకు ప్రత్యేకమైన ఆహార పదార్థాలు తయారు చేసేందుకు సిద్ధమైంది ఇస్రో. కర్ణాటకలోని మైసూర్లో డిఆర్డిఓ కి చెందిన డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లేబోరేటరీ ఇక అంతరిక్షంలో వ్యోమగాములు కోసం ప్రత్యేకమైన ఆహారాన్ని తయారు చేస్తుంది.
ఇకపోతే ఇటీవలే డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లేబరేటరీ శాస్త్రవేత్త ఒకరు మీడియాతో మాట్లాడి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. భూమి మీద కూర్చొని నిలబడి తినేందుకు అవకాశం ఉంటుంది. అంతరిక్షంలో జీరో గ్రావిటీ కారణంగా ఇక్కడ భూమ్మీద తినే చపాతీలు కూరలు అన్ని కూడా గాల్లో తేలిపోతు ఉంటాయి. అందుకే అంతరిక్షం లోకి వెళ్లే వ్యోమగాములు కోసం ప్రత్యేకమైన ఆహార పదార్ధాల జాబితాను సిద్ధం చేసి తయారు చేస్తున్నాము అంటూ చెప్పుకొచ్చారు. ఇలా తయారు చేస్తున్న వంటకాలలో భారతీయ వంటకాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ వంటకాల లిస్ట్ ఇలా ఉంది.
రెడీ టు ఈట్ :
వెజ్ పులావ్, వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, చికెన్ కుర్మా, దాల్ మఖానీ, సూజి హల్వా, చికెన్ కట్టి రోల్, వెజ్ కట్టి రోల్, ఎగ్ కట్టి రోల్, స్టఫ్డ్ పరోటా
రెడీ టు డ్రింక్ :
మ్యాంగో నెక్టర్, పైనాపిల్ జ్యూస్, టీ, కాఫీ..
కాంబో ఫుడ్ :
రాజ్మా చావల్, సాంబార్ చావల్, దాల్ చావల్, రెడీ టు ఈట్ ఎనర్జీ బార్స్
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి