ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పని చేద్దామనుకున్నా సరే... న్యాయ పరమైన సమస్యలు అడ్డుగా ఉంటున్నాయి. అది పరిపాలనా పరమైన అంశమైనా, రాజకీయ పరమైన  విషయమైనా సరే... ఏపీ సర్కార్‌కు హైకోర్టులు మొట్టికాయలు పడుతూనే ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండున్నర ఏళ్ల కాలంలో  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో దాదాపు 70 శాతం వాటికి హైకోర్టులో ఇబ్బందులు తలెత్తాయి. అది మూడు రాజధానుల ఏర్పాటు బిల్లు అయినా, ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేసే ప్రక్రియ అయినా, గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా కార్యదర్శులకు పోలీసు యూనిఫామ్ వేసే విషయంపైన అయినా సరే... తలనొప్పి మాత్రం తప్పడం లేదు. ఇప్పుడు తాజాగా సినిమాటోగ్రఫీ చట్టంలో కీలక మార్పులు చేసింది వైఎస్ జగన్ సర్కార్. గత నెలలో జరిగిన శాసనసభ సమావేశాల్లోనే ఈ చట్టంలో మార్పులు చేసి సభలో ప్రవేశ పెట్టారు మంత్రి పేర్ని నాని. ఇకపై సినిమా టికెట్లను ప్రభుత్వమే ఆన్ లైన్ ద్వారా విక్రయించాలనేది ఈ బిల్లులో సారాంశం. దీనిపై తొలి నుంచి విమర్శలు వెల్లువెత్తాయి కూడా.

ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... కొంత మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక అక్కడ బ్రేక్ పడింది. టికెట్ల విక్రయంపై ప్రభుత్వ పెత్తనం ఏమిటని ప్రశ్నించింది హైకోర్టు. ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేస్తున్నాట్లు ప్రకటించింది. అయితే దీనిని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఏదీ ఏమైనా సరే... తగ్గేదే లే అన్నట్లుగా కనిపిస్తున్నారు. ఇప్పటికే సినిమా టికెట్ల విషయంలో సెంటర్ల వారీగా ధరలు కూడా ఖరారు చేసింది జగన్ సర్కార్. ఇందుకు అనుగుణంగా జీవో నంబర్ 35 జారీ చేసింది. ఈ జీవో రద్దు చేయాలంటూ డిస్ట్రిబ్యూటర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత... జీవో కొట్టి వేస్తున్నట్లు హైకోర్టు తీర్పు వెలువరించింది. దీనిపైన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న ప్రభుత్వ పెద్దలు... డివిజన్ బెంచ్‌లో అప్పీలుకు వెళ్లింది. కొత్త సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో... దీనిని వెంటనే విచారించాలని కోరుతూ... డివిజన్ బెంచ్‌లో లంచ్ మోషనఅ పిటీషన్ దాఖలు చేసింది జగన్ ప్రభుత్వం.


మరింత సమాచారం తెలుసుకోండి: