కానీ కరోనా వైరస్ ప్రభావం తగ్గకపోవడంతో చివరికి రెండు సంవత్సరాల నుంచి వర్క్ ఫ్రం హోం కొనసాగుతోంది దీంతో ఉద్యోగులు అందరూ ఎంతగానో ఒత్తిడికి గురవుతున్నారు. ఎంతోమంది లో మానసిక సమస్యలు కూడా వస్తూ ఉండటం గమనార్హం.. అయితే ఇప్పుడు వరుసగా మూడో ఏడాది కూడా ఉద్యోగులు ఆఫీస్ కి వెళ్లాల్సిన అవసరం లేదు అన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవలే కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గడంతో ఫిబ్రవరి నుంచి ఆఫీసులు ఓపెన్ చేస్తే ఐటీ ఉద్యోగులు అందరూ కూడా కార్యాలయాలకు వెళ్ళ వచ్చు అని ఎంతగానో ఆనంద పడి పోయారు. కానీ ప్రస్తుతం కొత్త వేరియంట్ ఓమిక్రాన్ చాప కింద నీరులా ప్రపంచం మొత్తం విస్తరిస్తోంది.
దీంతో ఐటి కంపెనీలు మొత్తం తమ ఉద్యోగులందరిని ఆఫీసులకు పిలిచి పని చేయించడం పై మళ్ళీ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. అయితే టాప్ ఐటీ కంపెనీలు వచ్చే ఏడాది మే నెల వరకు కూడా ఉద్యోగుల్ని వర్క్ ఫ్రం హోం చేయాల్సిందేనంటూ వెల్లడించాయి. ఇక మిగతా కంపెనీలు కూడా ఇదే బాటలో వెళ్లడానికి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే వచ్చే ఏడాది మార్చి ఫిబ్రవరి నెలలో కేసులు భారత్లో పెరుగుతాయని తద్వారా లాక్ డౌన్ విధించే పరిస్థితులు వస్తాయి అంటూ నివేదికలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కంపెనీలు మరోసారి వర్క్ ఫ్రం హోం వైపు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇక వర్క్ ఫ్రొం హోమ్ కారణంగా అటు ఐటీ కంపెనీలకు మరింత బెనిఫిట్స్ ఉండడంతో ఇక ఎక్కువగా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోం ఉంటే బాగుంటుందని భావిస్తున్నాయట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి