ప్రస్తుతం దాదాపుగా ప్రపంచ దేశాలు ప్రజాస్వామ్య పాలన కొనసాగుతుంది. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పాలన సాగిస్తున్నారు. కానీ కొన్ని దేశాలలో మాత్రం ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు పాలన సాగిస్తూ ప్రజలను చిత్ర హింసలకు గురి చేస్తూ ఉండటం గమనార్హం. ప్రజా వ్యతిరేక విధానాలతో ఎప్పుడూ ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గామారిపోతూ ఉంటాయి. అలాంటి దేశాలలో మొదటగా చెప్పుకోవాల్సింది మయన్మార్. మయన్మార్ ప్రభుత్వం ప్రజల విషయంలో వ్యవహరించే తీరు ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది.


 నియంత పాలన కాదు అంతకు మించి అనే రేంజ్ లోనే మయన్మార్ దారుణాలకు పాల్పడుతూ ఉంటుంది. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని గద్దె దించి.. ప్రస్తుతం ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక అప్పటి నుంచి మయన్మార్ అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ముఖ్యంగా ప్రజలను బానిసలుగా చూస్తూ ఎదురు తిరిగిన వారిని దారుణంగా చంపేయడానికి కూడా వెనకాడటం లేదు ప్రభుత్వం. ఇటీవలే మయన్మార్లో ప్రభుత్వం పాల్పడిన ఒక ఘతుకం కాస్త ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.



ఏకంగా 30 మంది చిన్న పిల్లలు పలువురు పౌరులను మయన్మార్ ప్రభుత్వం దారుణం గా హత్య చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రజా వ్యతిరేక ప్రభుత్వం మాకు వద్దు ప్రజాస్వామ్య పాలన కావాలి అంటూ ప్రస్తుతం ఎంతో మంది ఉద్యమ బాట పడుతున్నారు ఇక ఇలాంటి వారిని అణిచి వేయడానికి అందరిలో భయం కలిగించడానికి మయన్మార్ పాలకులు దారుణం గా వ్యవహరిస్తున్నారు.. ఏకంగా ప్రజల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదు. ఇక ఇటీవల ఏకంగా ఒకేసారి 30 మంది ప్రాణాలు తీయడం మాత్రం సంచలనం గా మారి పోయింది. ఇక రానున్న రోజుల్లో ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి అనేది హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: