సినిమా టికెట్ల ధరల పై ప్రస్తుతం ట్విట్టర్లో వారు జరుగుతుంది అని చెప్పాలి పార్టీ టికెట్ల ధరలు తగ్గించడం వివాదంలోకి అటు సెన్సేషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ ఇవ్వడం ఈ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ వరుసగా ట్వీట్లు చేయడం ఏకంగా ఒక వీడియో విడుదల చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించడం సంచలనంగా మారిపోయింది ఈ క్రమంలోనే ఇటీవలే ఇక ఆ జీవి తన దైన శైలిలో ట్విట్టర్లో కౌంటర్ల మీద కౌంటర్ ఇచ్చారు అన్న విషయం తెలిసిందే మరి ఆ తర్వాత ఏపీ మంత్రుల ఊరుకుంటారా వర్మ కామెంట్స్ పై స్పందించిన మంత్రి పేర్ని నాని వర్మ అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం చెప్పారు.


   ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ట్వీట్ వార్ జరుగుతోంది. మంత్రి పేర్ని నానిని దర్శకుడు రాంగోపాల్ వర్మ టార్గెట్ చేశారు. ఏకంగా 10 ప్రశ్నలు సంధించారు.. వరుసగా మంత్రిపై సెటైర్లు కురిపించారు. ఆర్జీవీ ఆ రేంజ్‌లో ఫైర్ అయితే మంత్రి ఊరుకుంటారా.. ఆయన కూడా స్పందించారు. ట్విట్టర్ వేదికగానే వర్మ 10 ప్రశ్నలకు తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. వరుసగా ట్వీట్లకు సమాధానాలు ఇచ్చారు.


1. రూ.100 టికెట్ ను రూ.1000 కి, 2000కి అమ్ముకోవచ్చని ఏ బేసిక్ ఎకనమిక్స్ చెప్పాయ్? ఏ చట్టం చెప్పింది? దీన్ని ఏ మార్కెట్ మెకానిజం అంటారరా ? డిమాండ్ & సప్లై అని ఎవరైనా  అంటారా? అంటూ మంత్రి పేర్ని అని ప్రశ్నించారు.

2. ‘ఉప్పూ పప్పూ లాంటి నిత్యావసర వస్తువుల ధరల్ని మాత్రమే ప్రభుత్వం నియంత్రించవచ్చుగానీ, సినిమా టికెట్ల ధరల్ని ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందని మమ్మల్ని అడిగారు. థియేటర్లు అనేవి ప్రజా కోణంలో వినోద సేవలు పొందే ప్రాంగణాలు అంటూ వ్యాఖ్యానించిన మంత్రి పేర్ని నాని.. సామాన్యుడి మోజుని,అభిమానాన్ని లూటీ చేసే పరిస్థితి లేకుండా చూసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 66 ఏళ్ళుగా చట్టాలకు లోబడే సినిమా టికెట్ ధరను నిర్ణయిస్తున్నాయి వర్మ గారు అంటూ కౌంటర్ ఇచ్చారు.

3. ‘బలవంతంగా ధరలు తగ్గిస్తే మోటివేషన్‌ పోతుందన్నది ఎకనామిక్స్‌లో ప్రాథమిక సూత్రం అని చెప్పారు. మీరు చెప్పిన సూత్రం ఎవరికి వర్మగారూ? కొనేవారికా? అమ్మేవారికా?  మీరు ఎంతవరకు ప్రొడ్యూసర్స్‌ శ్రేయస్సు గురించే మాట్లాడుతూ కన్స్యూమర్ యాంగిల్‌ను గాలికి వదిలేసినట్టున్నారు. కాస్త ప్రేక్షకుల గురించి కూడా ఆలోచించండి వర్మ గారూ’.

4. ‘సినిమాను అత్యవసర సర్వీసుగా ప్రభుత్వం భావిస్తుంటే.. మెడికల్, ఎడ్యుకేషన్‌ మాదిరిగానే సబ్సిడీని ప్రభుత్వం భరించాలని అడిగారు. సినిమాను మేం నిత్యావసరంగా గానీ, అత్యవసరంగా గానీ భావించటం లేదు రాంగోపాల్ వర్మ గారూ అంటూ పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.


5. ‘హీరోలకు నిర్మాతలు ఇచ్చే రెమ్యూనరేషన్‌కు ఒక ఫార్ములా మీరు చెప్పారు. మీరు ఏ హీరోకు ఎంత ఇస్తారు? ఎంత ఖర్చుతో సినిమా తీస్తారు అన్నది పరిగణనలోకి తీసుకుని ఏనాడూ థియేటర్లలో టికెట్ల ధరను ఏ రాష్ట్ర ప్రభుత్వం  నిర్ణయించదు వర్మ గారూ. థియేటర్‌లో సినిమా టికెట్ల ధరల్ని ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాల ఆధారంగా నిర్ణయించాలని మాత్రమే 1970 సినిమాటోగ్రఫీ చట్టంలో ఉన్న నిబంధనలు చెపుతున్నాయి.

6. ‘ఒక వస్తువుకు సంబంధించిన మార్కెట్‌ ధర నిర్ణయంలో అసలు ప్రభుత్వానికి ఉన్న పాత్ర ఏమిటో సమాధానమివ్వండని మీరు అడిగారు. సినిమా ఒక వస్తువు కాదు. అది వినోద సేవ మాత్రమే అంటూ చెప్పిన పేర్ని నాని.. ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని మేం చేస్తున్నది థియేటర్లలో టికెట్‌ ధరల నియంత్రణ మాత్రమే తప్ప, సినిమా నిర్మాణ నియంత్రణ ముమ్మాటికీ కాదు వర్మ గారు అంటూ కౌంటర్ ఇచ్చారు.

7. ‘మీకు కింది నుంచి మద్దతు ఇవ్వటానికి ప్రజలు మాకు అధికారాన్ని ఇచ్చారని, మీ నెత్తిన ఎక్కి తొక్కటానికి కాదన్నారు. సినిమా టికెట్‌ను ఎంతకైనా అమ్ముకోనిస్తే పరిశ్రమకు కింది నుంచి బలాన్ని ఇచ్చినట్టు. సామాన్యుడిని దోచుకోకుండా ఆపితే మీ నెత్తిన ఎక్కి తొక్కినట్టు మీరు ప్రవచించటం సబబేనా వర్మ గారూ?’ అంటూ మంత్రి పేర్ని నాని వరుసగా ట్వీట్‌లు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rgv