వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఇటు జగన్మోహన్ రెడ్డితో పాటు అటు చంద్రబాబునాయుడుకు కూడా చాలా కీలకమనే చెప్పాలి. చాలామంది వచ్చే ఎన్నికలు చంద్రబాబుకు మాత్రమే కీలకమని అనుకుంటారు. ఇది ఒకరకంగా కరెక్టే అయినా జగన్ కు మరోరకంగా కీలకమైంది. ఎలాగంటే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాకపోతే తెలుగుదేశంపార్టీకి భవిష్యత్తు దాదాపు ఉండదనే అనుకోవాలి. ఇపుడు తెలంగాణాలో పార్టీ పరిస్దితి ఎలాగుందో అంతకన్నా దారుణంగా తయారవుతుంది.




చంద్రబాబుకు ఇప్పటికే 73 ఏళ్ళు. 2024 తర్వాత ప్రతిపక్షంలోనే ఉండాల్సొస్తే ఇపుడున్నంత యాక్టివ్ గా ఉండలేరన్నది వాస్తవం. కాబట్టి 2029 ఎన్నికలకు చంద్రబాబు పాత్ర పెద్దగా ఉండదు. ఒకసారి చంద్రబాబు చేతిలో నుండి పార్టీ పగ్గాలు జారిపోతే ఇపుడున్న మీడియా మద్దతు కూడా ఉండదు. చంద్రబాబును నడిపిస్తున్నది కేవలం ఎల్లోమీడియా మాత్రమే. జగన్ అంటే చంద్రబాబుకు ఎంత వైరముందో ఎల్లోమీడియాకు కూడా అంతే వైరముంది. కాబట్టే జగన్ కు వ్యతిరేకంగా అందరు చేతులు కలిపింది.




ఇంతమంది చేతులు కలిపినా వచ్చే ఎన్నికల్లో మళ్ళీ  జగనే అధికారంలోకి వస్తే పరిస్దితి ఎలాగుంటుందో చెప్పక్కర్లేదు. ఆ పరిస్ధితిని ఊహించుకోటానికే ఎల్లోబ్యాచ్ ఇష్టపడటంలేదు. అందుకనే జగన్ను ఎదుర్కోవటానికి ఒకవైపు చంద్రబాబు ఎంత ప్రయత్నిస్తున్నారో అంతకుమించి మరోవైపు ఎల్లోమీడియా ప్రయత్నాలు చేస్తోంది. అంటే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి తీరాల్సిందే. లేకపోతే అంతే సంగతులు.




ఇక జగన్ యాంగిల్లో చూస్తే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలవటం ద్వారా తనకు రాజకీయంగా ఎదురన్నదే లేకుండా చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇందులోభాగంగానే  తెలుగుదేశంపార్టీని భూస్ధాపితం చేసేందుకే ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఓడించటం ఒకఎత్తు, కుప్పంలో చంద్రబాబును ఓడించటం మరోఎత్తు. రెండింటిని సాధ్య చేసేదుకే జగన్ ప్లాన్ చేస్తున్నారు. మొన్న కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓటమినే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు.




అలాంటిది రాబోయే ఎన్నికల్లో ఎంఎల్ఏగా కూడా ఓడగొట్టేస్తే చరమాంకంలో చంద్రబాబును రాజకీయంగా చావుదెబ్బ కొట్టినట్లే అవుతుందన్నది జగన్ ప్లాన్. అందుకనే వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఎవరి వ్యూహాలు వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు. కాకపోతే వయసు రీత్యా, ఇతర పరిస్దితులను భేరీజీ వేసుకుంటే ఇప్పటికి జగన్ దే పైచేయిగా కనిపిస్తోంది. అందుకనే వేర్వేరు కారణాలతో వచ్చే ఎన్నికల్లో ఇద్దరికి కీలకమనే చెప్పాలి. ఆ విషయం ఇద్దరికీ తెలుసు కాబట్టే రాజకీయంగా ఇంత గోల నడుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: