కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో మాస్క్ అనేది ఎంతో తప్పనిసరిగా మారిపోయింది. అయితే ప్రతి ఒక్కరూ పెట్టుకొని కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే సమయంలో ఒక కొన్ని కొన్ని సార్లు మాస్క్ పెట్టుకున్న తర్వాత కూడా వ్యాధి బారిన పడే దుస్థితి ఏర్పడుతుంది. దీంతోఇలాంటి పరిస్థితులను కూడా ఎదుర్కునేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గం గా మారిపోయింది. దీంతో ప్రపంచ ప్రజానీకం మొత్తం  వ్యాక్సినేటెడ్ గా మారిపోతున్నారు అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం అన్ని దేశాలలో వాక్సినేషన్ ప్రక్రియ  వేగంగా కొనసాగుతోంది. ప్రతి ఒక్కరికీ టీకా అందించడమే లక్ష్యంగా ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయి. కొన్ని దేశాలలో వ్యాక్సిన్ ప్రజలందరికీ ఉచితంగా అందిస్తూ ఉండగా..  కొన్ని దేశాలలో మాత్రం ప్రజలు టీకా కొనుక్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ప్రభుత్వాలు ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తున్నప్పటికీ ఎంతో మంది ప్రజలు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పాలి. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించాలని ప్రభుత్వం లక్ష్యానికి ప్రజల నిర్లక్ష్యం తూట్లు పొడుస్తోంది. కరోనా వైరస్ పై ఎంతో అవగాహన పెరిగిపోయిన నేటి రోజుల్లో కూడా వ్యాక్సిన్ వేసుకోవడానికి ఇప్పటికీ ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో ఇలా వ్యాక్సిన్ వేసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారి పట్ల అటు ప్రభుత్వాలు కూడా కఠినంగానే వ్యవహరిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ  వ్యాక్సిన్ వేసుకుని కరోనా వైరస్ పై పోరాటానికి సిద్ధం కావాలి అంటూ ప్రభుత్వాలు ఎంత మొత్తుకున్నా ఎంతో మంది జనాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో వారిపై కఠిన ఆంక్షలు విధిస్తున్నాయ్ ప్రభుత్వాలు. ఇటీవలే కెనడాలోని క్యూబెక్ ప్రావిన్స్ లో కూడా వ్యాక్సిన్ వేసుకోకుండా ఉన్న వారికి హెచ్చరికలు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం. వ్యాక్సిన్ వేసుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్న వారిపై హెల్త్ టాక్స్  విధిస్తామని  అంటూ  ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. దీంతో మొన్నటి వరకూ టీకా కు దూరంగా ఉండేవారు. ఇక ఇప్పుడు ఎగబడి మరీ టీకా వేసుకుంటూ ఉండడం గమనార్హం.  ప్రతి రోజూ లక్షల మందికి పైగానే వ్యాక్సిన్ తీసుకుంటున్నట్లు కెనడా ప్రభుత్వం తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: