ప్రపంచం మొత్తం తాలిబన్ల ప్రభుత్వంపై ఆంక్షలు విధిస్తున్న అటు తాలిబన్ల తీరులో మాత్రం ఎలాంటి మార్పు రావడంలేదు. ఒకవైపు దేశంలో ఆర్థిక సంక్షోభం ఆహార సంక్షోభం పెరిగిపోతున్న మా పాలన మాదే అన్నట్టు గా తాలిబన్లు ముందుకు సాగుతుండడం గమనార్హం. అధికారంలోకి వచ్చిన తర్వాత పిల్లలకు పూర్తి స్వేచ్ఛ కలిగిస్తామని అందరూ ఉద్యోగాలు చేసుకునేందుకు అవకాశం కూడా కల్పిస్తామంటూ తాలిబన్లు ఎన్నో మాటలు చెప్పారు.. కానీఅధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మొత్తం తాలిబన్ల అసలు రంగు బయటపెడుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మహిళల పట్ల ఎంతో దారుణం గా వ్యవహరిస్తున్నారు తాలిబన్లు. కనీసం ఇంటి నుంచి కాలు బయట పెట్టేందుకు కూడా అనుమతి ఇవ్వకుండా కఠిన ఆంక్షలు అమలు చేస్తూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే ఇక తాలిబన్ల తీరును నిరసిస్తూ మాకు స్వేచ్ఛ కావాలి అంటూ నినాదాలు చేస్తూ ఎంతో మంది మహిళలు రోడ్ల పైకి చేరి నిరసనలు ఉద్యమాలు చేపడుతున్నారూ. అయితే ఇలా ఉద్యమాలు చేపడుతున్న మహిళల పట్ల కూడా తాలిబన్లు ఎంతో దారుణంగా వ్యవహరిస్తూ  ఉండటం గమనార్హం. ఇటీవలే ఉద్యమాలు చేపడుతున్నా మహిళలపై ఏకంగా పెప్పర్ స్ప్రే తో దాడి చేసిన ఘటన కూడా ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇప్పుడు తాలిబాన్లు మరోసారి అరాచకానికి పాల్పడ్డారు అనేది తెలుస్తుంది. తాలిబన్ల తీరుకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న మహిళలు అందరూ ఒక అపార్ట్మెంట్లో ఉన్నారు అని సమాచారం అందుకున్న తాలిబన్లు దారుణంగా వ్యవహరించారు. ఏకంగా అపార్ట్మెంట్ మహిళలు ఉండడంతో డోర్ బద్దలు కొట్టి మరీ లోపలికి వెళ్లి అక్కడి నుంచి వాళ్ళని తీసుకెళ్లారు. ఇక ఆ  మంది మహిళలనూ తాలిబన్లు ఎక్కడికి తీసుకెళ్లాలో అన్నది మాత్రం ప్రస్తుతం ఆచూకీ తెలియని పరిస్థితి నెలకొంది. గతంలో కూడా ఇలాగే కొంతమంది మహిళలను తాలిబన్లు తీసుకెళ్లగా ఆ తర్వాత శవాలుగా దర్శనం ఇచ్చారు.  ఇలా ఒక వైపు ప్రపంచం మొత్తం తాలిబన్ల  ప్రభుత్వంపై ఆంక్షలు విధిస్తుంది. అయినా తాలిబన్లు మాత్రం ఇంకా రెచ్చిపోతూనే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: