ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్న వేళ తనకు బెయిల్ ఇవ్వాలని, ఎన్నికల ప్రచారంలో తాను పాల్గోనేందుకు అనుమతి కూడా ఇవ్వాలని ప్రముఖ రాజకీయ వేత్త న్యాయ స్థానాన్ని అభ్యర్థించారు. సుప్రీం కోర్టులో ఈ మేరకు ఆయన పిటీషన్ దాఖలు చేశారు. ఇంతకీ ఎవరా నేత?
సమాజ్ వాదీ పార్టీ నేత అజాంఖాన్  సుప్రీం కోర్టులో శనివారం పిటీషన్ దాఖలు చేసినట్లు  జాతీయ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతున్నందున తనకు ప్రచారం చేసే అవకాశం కల్పించాలని అజాం ఖాన్ కోర్టును అభ్యర్థించారు.
ఉత్తర ప్రదేశ్ లో ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తనపై కేసులు మోపిందని ఆయన ఆరోపించారు. తనకు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు చాలా పన్నాగాలు పన్నిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. తనకు బెయిల్ ఇస్తే తాను వెళ్లి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని కూడా ఖాన్ కోర్టుకు తెలిపారు. తనపై ఉన్న కేసుల్లో మూడు కేసులకు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు అవసరమైన కుయుక్తలన్నింటినీ ఉత్తర ప్రదేశ్ లోని బిజేపీ పాలుకు పన్నారని తెలిపారు. తనపై ఆరోపించిన క్రిమినల్ కేసులు ఒక పథకం ప్రకారం జరిగాయని తెలిపారు.
 అజాంఖాన్ పలు కేసుల్లో నిందితుడుగా |ఉన్నారు. దాదాపు ఇరవైకి పైగా కేసులు అతని పై నమోదయి ఉన్నాయి.  ఖాన్ 2020 నుంచి   సితాపూర్ జైలులో ఉన్నారు. ఆయన గతంలో ఎన్నిసార్లు బెయిలో కోసం ప్రయత్నించినా  న్యాయస్థానం మంజూరు చేయలేదు. దీంతో ప్రస్తుతం ఆయన మరలా బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశారు.
ఉత్తర ప్రదేశ్ లో 403 అసెంబ్లీ నియోజక వర్గాలకు ఏడు విడుతల్లో ఎన్నిక జరగనుంది. ఫిబ్రవరి 10 న తోలివిడత పోలింగ్ నిర్వహిస్తారు.  వరుసగా ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 20, ఫిబ్రవరి 23, తో పాటు 27 తేదీలలో ఎన్నిక జరుగుతుంది. ఆ తరువాత మార్చి 3వతేదీ, ఏడవ తేదీతో జరిగే ఎన్నికలతో ఈ క్రతువు సమాప్తమవుతుంది. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరగనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

sp