పీఆర్సీ వివాదంపై కోర్టులో కేసు వేసిన పిటీషనర్ పై కోర్టు సీరియస్ అయిన విషయం తెలిసిందే. పీఆర్సీ వివాదంపై కోర్టులో ప్రభుత్వాన్ని సవాలు చేసే హక్కే ఉద్యోగులకు లేదని తేల్చేసింది. ఉద్యోగుల జీతాలను తగ్గించే అధికారం ప్రభుత్వానికి ఉందని స్పష్టంగా కోర్టు తేల్చిచెప్పింది. సమ్మె చేస్తామని చెప్పి నోటీసు ఇవ్వటం ద్వారా ప్రభుత్వాన్నే బెదిరిస్తారా ? అంటు మండిపడింది. అనేక విషయాల్లో పిటీషనర్ ను పట్టుకుని కోర్టు వాయించేసినట్లు సమాచారం.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేస్తే తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశించిన పిటీషనర్ కు కోర్టు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఇంతకీ పిటీషనర్ పై కోర్టు ఎందుకింత సీరియస్ అయ్యింది ? ఎందుకంటే అందుకు పిటీషనరే కారణమని అర్ధమవుతోంది. విషయం ఏమింటే కోర్టులో విచారణ సందర్భంగా అనేక ఆశక్తికరమైన విషయాలపై చర్చ జరిగింది. ఉద్యోగుల బేసిక్ జీతం తగ్గిపోతుందని ఒకసారి, హెచ్ఆర్ఏ బాగా తగ్గిపోతుందని మరోసారి పిటీషనర్ వాదన వినిపించారు.
పిటీషనర్ రకరకాలుగా వాదన వినిపిస్తున్నపుడు అడ్వకేట్ జనరల్ జోక్యం చేసుకుని తన వాదన వినిపించారట. ఇంతకీ ఆ వాదన ఏమిటంటే పిటీషనర్ కృష్ణయ్య పాత జీతం ఎంత ? కొత్త పీఆర్సీ ప్రకారం రాబోయే జీతం ఎంతనే విషయాన్ని అడ్వకేట్ జనరల్ లెక్కలతో సహా వివరించారట. అడ్వకేట్ జనరల్ వివరించిన లెక్కలు ఎలాగున్నా హోలు మొత్తం మీద పాత జీతంకన్నా కొత్తగా అందుకోబోయే మొత్తం జీతం రు. 28 వేల రూపాయలు పెరుగుతుందని ఫైనల్ లెక్క చెప్పారట.
ఇదే విషయాన్ని కోర్టు పిటీషనర్ ను అడిగిందట. అయితే దానికి పిటీషనర్ సూటిగా సమాధానం చెప్పలేదు. దాంతో రెండోసారి రెట్టించి కోర్టు అడగ్గానే పిటీషనర్ రు. 28 వేల జీతం పెరిగే మాట వాస్తవమే అని అంగీకరించారట. పిటీషనర్ కు మాత్రమే పెరుగుతుందా లేకపోతే అందరికీ వాళ్ళ బేసిక్ ప్రకారం పెరుగుతుందా అని అడిగినపుడు అడ్వకేట్ జనరల్ అందరికీ పెరుగుతుందని చెప్పారట. దానికి పిటీషనర్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదట. దాంతోనే కోర్టుకు విషయం అర్ధమైపోయింది.
ఒకవైపు లక్షల్లో జీతాలు తీసుకుంటు, వేలల్లో పెరుగుతు కూడా ఇంకా తమకు జీతాలు పెరగటం లేదని హెచ్ఆర్ఏ తగ్గుతోందని ఉద్యోగుల నేతలు సమ్మెకు పిలుపివ్వటాన్ని జనాలు తప్పుపడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చాలా ఎక్కువగా ఉందనే భావన జనాలందరిలోను ఉంది. కరోనా వైరస్ కష్టకాలంలో వేలాదిమంది ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయి అవస్తలు పడుతుంటే ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం తాము అనుకున్నంత జీతాలు పెరగలేదని సమ్మెకు వెళుతుండటమే విచిత్రంగా ఉంది. అందుకనే పిటీషనర్ కేసులో  విచారణార్హత లేదని తేల్చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: