నూనెగింజల పంటల్లో, ప్రధానమైన పంట వేరుసెనగ. ముఖ్యంగా ఈ పంటను యాసంగిలో రాయలసీమ, ఉత్తరాంధ్ర తెలంగాణ లోని జిల్లాల్లో అధికంగా సాగు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం పంట వివిధ దశల్లో ఉంది. వేరుశెనగ ముఖ్యంగా పూత దశ, గింజ కట్టేటువంటి దశలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ సమయంలోనే చీడ పీడలు  పంటకు ప్రధాన సమస్యగా ఉంటాయి. వీటి నివారణకు చేపట్టాల్సిన చర్యలను తెలుసుకుందాం.ఖరీఫ్ వరి కోతల తర్వాత రబీలో వేరుశనగను సాగు చేయడం ఆనవాయితీగా ఉంది. రబీలో వేరుశెనగను నీటి వసతి కింద సాగు చేస్తారు. కనుక ఖరీఫ్ కంటే ఎక్కువ దిగుబడులు పొందుతున్నారు. తేలిక నేలలు, ఎర్ర చెలక నేలల్లో రైతులు వేరుశనగను వేస్తారు. ఒక్క తెలంగాణలోనే రెండు లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగవుతుంది. ప్రస్తుతం పూత,పిందె దశలో ఉంది.

 ఈ సమయంలో సమగ్ర ఎరువుల యాజమాన్యం, కలుపు యాజమాన్యం చేపడితే దిగుబడి అధికంగా రావచ్చు.వేరుశెనగ పెట్టేటప్పుడే 100 కి. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 33 కి. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ దమ్ము చేసే సమయంలో తీసుకోవాలి. 18 కి.యూరియాను ఆఖరి దుక్కిలోనే వేసుకోవల్సి ఉంటుంది. 10 కి. యూరియాను విత్తనాలు పెట్టిన 30 రోజులకు తొలి పూత దశలో మళ్ళీ పైపాటుగా యూరియాను వేసుకోవాలి. విత్తనాలు పెట్టిన తర్వాత 25 నుంచి 30 రోజుల్లో గడ్డిజాతి కలుపు మాత్రమే కనిపిస్తుంది. ఈ కలుపు కనిపించినప్పుడు క్విజీనోఫాస్ పి ఇథైల్ కలుపు మందు 400 మి.లీ ను 200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. లేదంటే గడ్డిజాతి మొక్కలు సమపాళ్లలో ఉన్నప్పుడు ఇమాజితా ఫైర్ 250 మి.లీ. 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. వేరుశనగ పెట్టిన 30 నుంచి 35 రోజులకు పూత సమయం వస్తుంది. ఈ సమయంలో సుక్ష్మ దాత లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. దీంతో పంట దిగుబడులు తగ్గుతాయి.

రైతులు సమగ్ర యాజమాన్యం చేపడితే అధిక దిగుబడులు పొందవచ్చు. చివరికి విత్తనశుద్ధి కచ్చితంగా పాటించాలి. 1.గ్రా ట్యూబికోనాజోల్ తోని విత్తన శుద్ధి చేసుకోవాలి. అలా చేసిన తర్వాత కూడా మొదలు కుళ్ళు తెగులు కనిపించినట్లైతే 1. గ్రా. కార్బెండిజమ్ అనే మందును ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. విత్తనాలు పెట్టిన తర్వాత కాండం కుళ్ళు తెగులు వచ్చే ఆస్కారం ఉంటుంది. అలాంటి సమయంలో మనం కచ్చితంగా విత్తన శుద్ధి చేస్తే అధిక దిగుబడి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: