ట్రంప్ వ‌చ్చినాడు..ఇవాంక వ‌చ్చినాది.. ఆ విధంగా ఇరు దేశాలూ అక్క‌డే టీ, టిఫిన్ పుచ్చుకుని ఆ అంత‌ర్జాతీయ హోటల్ బ్రాండ్ ఇమేజ్ ను మ‌రోసారి పెంచినారు. ఆ విధంగా వ‌హ్ తాజ్ అని కూడా అన్నారు. అది వేరు కానీ ఈ క‌థ ఇంకా వేరు. ఇలా రాస్తే కేసీఆర్ కు కోపం వ‌చ్చినా రావొచ్చు కానీ ఆయ‌న ద‌గ్గ‌ర ప‌నిచేసే ఓ బ్యూరోక్రాట్ నిబంధ‌న‌లు అతిక్ర‌మించి మ‌రీ! అంత‌టి కాస్ట్లీ హోట‌ల్ లో ఒక‌టి కాదు రెండు కాదు నాలుగు రోజుల పాటు త‌న గారాల ప‌ట్టి వివాహాన్ని ఆకాశం అబ్బుర‌ప‌డేలా అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించి అంద‌రినీ ఆశ్చ‌ర్య చ‌కితుల్ని చేశారు. ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో!

 
తెలంగాణ ముఖ్య‌మంత్రి  కేసీఆర్ మ‌రో వివాదంలో ఇరుక్కున్నారు.నేరుగా కాక‌పోయినా త‌న స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ ర‌జ‌త్ కుమార్ కుమార్తె అంజ‌లి వివాహం విష‌య‌మై చాలా అంటే చాలా దుమారం రేగుతోంది.ఎందుకంటే ఆ అమ్మాయి పెళ్లికి ఖ‌రీద‌యిన హోట‌ళ్లు బుక్ చేశారు.అందులో ఒక‌టి తాజ్ ఫ‌ల‌క్ నుమా! గ‌త ఏడాది డిసెంబ‌ర్ 17 నుంచి 21 వ‌ర‌కూ వివాహ వేడుక‌లు జ‌రిగాయి. ఓ ఐఏఎస్ అధికారి కూతురు పెళ్లికి ఇంత‌టి ఖ‌రీద‌యిన హోట‌ళ్లు బుక్ చేశారంటే అందుకు త‌గ్గ డ‌బ్బు ఎవ‌రు ఇచ్చార‌ని?


ఎందుక‌ని ఇంత‌టి అట్ట‌హాసంగా ఆ అమ్మాయి పెళ్లి చేయాల్సి వ‌చ్చింద‌ని ఓ టాక్ న‌డుస్తోంది.ట్రంప్ వ‌చ్చిన‌ప్పుడు,ఇవాంక‌కు  అతిథి మ‌ర్యాద‌లు చేసిన‌ప్పుడు తాజ్ ఫ‌ల‌క్ నుమాలాంటి అంత‌ర్జాతీయ స్థాయి హోటల్ ను బుక్ చేయ‌డం అన్న‌ది ప‌రిపాటి అని కానీ ఇక్క‌డ ఓ ఐఏఎస్ అధికారి విష‌య‌మై ఇంత‌టి ఖ‌ర్చు ఎందుక‌ని విప‌క్షాలు గొంతెత్తుతున్నాయ‌ని  ప్ర‌ధాన మీడియా వివ‌రిస్తోంది.


ఈ క‌థ వెనుక ఓ ప్ర‌ముఖ కంపెనీ ఉంద‌న్న ఆరోప‌ణ‌లూ వినిపిస్తున్నాయి.షెల్ కంపెనీ బిగ్ వేవ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో హోట‌ల్ బిల్లుల చెల్లింపులు చేయించార‌ని ర‌జ‌త్ కుమార్ పై బ‌ల‌మైన ఆధారాల‌తో కూడిన అభియోగాలే వ‌స్తున్నాయి. అంటే ఆ కంపెనీ క‌నుస‌న్న‌ల్లోనే ఈ వివాహ వేడుక‌లు అత్యంత వైభ‌వోపేతంగా జ‌రిగాయ‌న్న‌ది రూఢీ అయింది లేదా నిర్థార‌ణ అయింది.దీనిపై కేసీఆర్ ఎటువంటి వివ‌ర‌ణ ఇవ్వ‌నున్నారో? లేదా అవ‌న్నీ ఒట్టి ఆరోప‌ణ‌లే అని కొట్టిపారేస్తారో ? ప్ర‌స్తుతానికైతే దైవానికే ఎరుక !


మరింత సమాచారం తెలుసుకోండి:

trs