కేంద్ర బడ్జెట్ సమావేశాలకు సమయం ఆసన్నమైంది. ఈ బడ్జెట్ ఎవరికి అనుకూలంగా ఉంటుంది మరియు ఎవరికి ప్రతికూలంగా మారుతుందో అనేది ఆసక్తి రేపే అంశం. ఇప్పటికే కరోనాతో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు ఈ బడ్జెట్ ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఎన్నికలు జరిగే టువంటి ఐదు రాష్ట్రాల కే మోదీ సర్కార్ వరాలు కురిపిస్తుందా అనేది ముందున్న ప్రశ్న. మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి బడ్జెట్లో ఎన్నికలు ఉన్నటువంటి రాష్ట్రాలకు మాత్రమే బడ్జెట్ అనుకూలంగా ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. ఈసారి మాత్రం ఐదు రాష్ట్రాల ఎన్నికలు కొన్ని రోజుల్లో జరగబోతున్నాయి.

 ఈ సందర్భంలో బడ్జెట్ రావడం ఆసక్తి రేపే విషయంగా మారింది. మరి అయిదు రాష్ట్రాలైన పంజాబ్ ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ , గోవా, మణిపూర్ రాష్ట్రాలకు  మరి ఈ బడ్జెట్ లో ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉన్నట్టు  గత బడ్జెట్ ను  బట్టి చూస్తే మాత్రం అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క ఐదు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు, రోడ్లు, రైల్వే మౌలిక సదుపాయాలు కల్పించే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఇప్పటికే వ్యవసాయ చట్టాలపై పంజాబ్, హర్యానా, యూపీలో రైతులు తీవ్రంగా ఉద్యమం చేశారు. చివరికి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఈ చట్టాలను వెనక్కి తీసుకుంది. ఈ సందర్భంలోనే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు దగ్గరయ్యేలా కేంద్రం బడ్జెట్ సిద్ధం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధానంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన వంటి పథకాలకు ఈసారి బడ్జెట్ ఎక్కువగా కేటాయించే అవకాశం ఉన్నట్టు కనబడుతోంది. అలాగే పట్టణాల్లో కూడా ఉపాధి అవకాశాలు కల్పించే టువంటి కార్యక్రమాలకు కూడా ఎక్కువ అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కరోనా సమయంలో ఎక్కువగా పట్టణాల్లో ఉపాధి కోల్పోయి చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో అర్హులైన వ్యక్తులకు కనీసం 180 రోజులు ఉపాధి ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే జి.డి.పి వృద్ధి రేటు 9.2% నమోదు కావచ్చని అంచనాలు ఉన్నాయి. కానీ ద్రవ్యోల్బణం 5. 59 శాతం ఉంది. అలాగే చమురు ధర ఆకాశాన్ని చేరుకుంది. నిరుద్యోగం 80 శాతం వరకు పెరిగిపోయింది.

 ఉద్యోగ అవకాశాల దిశగా ఈ బడ్జెట్లో చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. అయితే ఎన్నికల సందర్భంగా ప్రజలపై ఎక్కువ భారం పడకుండా ఈ బడ్జెట్లో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మరియు ముఖ్యంగా ఐదు రాష్ట్రాల పైనే మోదీ సర్కారు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. దేశంలో మోడీ సర్కార్ అన్ని రాష్ట్రాలను బడ్జెట్ విషయంలో సమానంగా చూడటం లేదని దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: