వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డమ్మీ కరెన్సీ కాగితాలతో మోసాలకు పాల్పడుతున్న ఎనిమిది మంది సభ్యుల గుట్టును రట్టు చేశారు.  ఈ 8 మంది సభ్యుల ముఠా లోని నలుగు ముఠా సభ్యులను టాస్ఫోర్స్,.. వర్ధన్నపేట పోలీసులు అరెస్టు చేసారు. వారి నుండి  26.8లక్షల విలువగల నకిలీ 2వేల నోట్లతో పాటు వివిధ రకాల రసాయనక ద్రావణాలను స్వాధీనం చేసుకున్నారు అంతే కాదు రైస్ పుల్లింగ్ చేసేందుకు వినియోగించే.. రెండు రాగి కలశాలు, ఒక రాగి జగ్గు, ఒక కత్తి, రాగి నాణేం, బ్యాటరీలు, టార్చిలైట్లు, నాలుగు సెల్ ఫోన్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అదనపు సంపాదన కోసం మోసాలకు సిద్ధపడ్డ   8 మంది సభ్యులు.   నకిలీ నోట్లు దందా తో పాటు రైస్ పుల్లింగ్ కి ప్లాన్ చేశారు.  అందులో భాగంగా 50 వేల అసలు నోట్లకు మూడు రేట్ల నకిలీ నోట్లను ఇచ్చేలా ఒప్పందం చేసుకొని పోలీసుల నకిలీ నోట్లు పట్టు పడకుండా ఉండేందుకు ప్లాన్ చేశారు.   ముందుగా 2వేల రూపాయల నకిలీ నోట్లు వున్న డబ్బాతో పాటు ఎవరికీ అనుమానం రాకుండా వుండేందుకు రెండువేల రూపాయల నకిలీ నోట్లను నలుపు కాగితాలుగా మార్చి, వాటిని తిరిగి నలుపు రంగులో వున్న కాగితాలను రసాయన ద్రావణంతో శుభ్రం చేయడంతో  తిరిగి నలుపు కాగితాలు2000 నకిలీ నోట్లుగా మార్చే ప్రక్రియను వీడియో తీసిన నిందితులు దీని ఆధారంగా నకిలీ నోట్లను ఇచ్చేందుకు నగరం లో ప్రయత్నాలు చేస్తున్నారు 

ఈ సమాచారం అందుకున్న పోలీసు దాడి చేసి 8 మంది ముఠా లోని నలుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు వీరిని విచారించగా ముమ్మాడి ధనుంజయ్ ఆలియాస్ శివ వనపర్తి జిల్లా, గుట్టా హరిప్రసాద్ రెడ్డి రంగారెడ్డి జిల్లా, గడ్డం నాగరాజు ఇల్లందు గ్రామం, వర్ధన్నపేట, వరంగల్ జిల్లా, చల్లా మహేష్, గొర్రెకుంట వరంగల్ జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. కాగా.. రాజు వర్ధన్నపేట, అశోక్ పెద్దమ్మగడ్డ, కిషన్ కామారెడ్డి, సతీష్ మహబూబాబాద్‌కు చెందిన వారు పరారీలో ఉన్నట్లు పోలీసుల విచారణ లో తేలింది. ఈ ముఠా సభ్యులు నకిలీ నోట్ల చలామణి తో పాటు. అతేంద్ర శక్తులు ఉన్న పాత్రల అమ్మేదుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు విచారణ లో తేలింది రైస్ పుల్లింగ్ కోసం వాడే రాగి పాత్రలు, గోపురం కలశాలు, రాగి నాణేలను వివిధ రసాయలతో పురాతన వస్తువులుగా మార్చి అమ్మకాలు చేసి డబ్బు సంపాదించాలన్న ఆలోచనలను ఆదిలోనే పట్టేశారు.  వారి దగ్గర నుండి.  రెండు రాగి కలశాలు, ఒక రాగి జగ్గు, ఒక కత్తి, రాగి నాణేం, బ్యాటరీలు, టార్చిలైట్లు, నాలుగు సెల్ ఫోన్‌లు స్వాధీనంచేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: