కేసీఆర్ జనగాం జిల్లాకు వెళుతున్నారని బీజేపీ కార్యకర్తలను రెండ్రోజులుగా పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం అన్యాయమన్నారని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ‘‘వాళ్లేమైనా ఉగ్రవాదులా? నిషేధిత సంస్థ సభ్యులా? సీఎంకు బీజేపీ కార్యకర్తలంటే ఎందుకంత భయం? రెండ్రోజులుగా పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడమేంది? తీవ్రవాదులకు మద్దతిచ్చే పార్టీల నాయకులు యధేచ్చగా తిరుగుతుంటే వారికి వత్తాసు పలుకుతూ ఆ పార్టీ నేతల చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న కేసీఆర్ జనం కోసం పోరాడే బీజేపీ కార్యకర్తలను నిర్బంధాలకు గురిచేయడమేంది? పోలీసులను అడ్డం పెట్టుకుని ఇంకెన్నాళ్లు పాలన కొనసాగిస్తారు?’’అంటూ బండి సంజయ్ మండిపడ్డారు. టీఆర్ఎస్ గూండాల దాడిలో గాయపడ్డ కార్యకర్తలను పరామర్శించడానికి వెళుతుంటే బీజేపీ ఫ్లోర్ లీడర్ రాజాసింగ్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు లను హౌజ్ అరెస్టు చేయడం అప్రజాస్వామికమని బండి సంజయ్ ఖండించారు. ‘‘ పోలీసుల సమక్షంలోనే బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ గూండాలు దాడులు చేసి తీవ్రంగా గాయపరుస్తున్నారు. డీజీపీ, పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి