వివాదాలకు దూరంగా ఉంటే ఆ వైదికుడు వివాదాల్లో ఇరుక్కుంటే ఏం చేయడం? అయితే ఆయన తన తప్పు దిద్దుకున్నారు. తప్పు ఒప్పుకుని చెంపలేసుకున్నారు.ఫలితంగా వివాదం తగ్గి, సామారస్య పూర్వక ధోరణి ఇరు వర్గాల్లో పెరిగింది.ప్రపంచానికి ప్రవచనకర్తగా సుపరిచితులు ఆయన.మంచి ఎలా ఉండాలో చెడు ఎలా ఉండకూడదో కూడా చెప్తారాయన.మంచికి చెడుకు మధ్య భేదం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో కూడా చెబుతారు.ప్రవచనంలో ఎంతటి తీక్షణత ఉంటుందో తీవ్రత ఉంటుందో నడవడిలోనూ అలానే ఉంటుంది.ఆయన విమర్శ కూడా కొన్నిసార్లు సభికులను మెప్పిస్తుంది.కానీ ఆ మధ్య ఆయన చెప్పిన ఓ మాట ఓ సామాజికవర్గం కోపానికి కారణం అయింది.అదేవిధంగా వారి ఆగ్రహానికి అవధి లేకుండా చేసింది. ఈ నేపథ్యంలో ఎప్పుడూ లేని విధంగా పండితుడు కాస్త తడబడ్డారు.దిద్దుకోలేని తప్పు అయితే తాను చేయనని ఆ విధంగా చేస్తే తప్పక దిద్దుకుంటానని క్షమాపణలు కోరారు.దీంతో సంబంధిత వర్గాలు శాంతించాయి.పండితుడి మాటకు అంగీకారం తెలిపాయి.
మాట ఎలా ఉండాలో చెప్పే ఆయన..తన మాటతో కట్టు తప్పారు. మాట ఎలా ఉండాలో తరుచూ బోధించే ఆయన తన మాటను మరో వర్గం గాయపడేవిధంగా వాడారు.దీంతో ఎప్పటి నుంచో నలుగుతున్న వివాదం ఒక్కసారిగా రాజుకుంది. ప్రశాంత గోదావరి తీరాన పండితుడు గరికిపాటికి నిరసనల జ్వాల తగిలింది.దీంతో ఆయన దిగివచ్చారు.తన మాటను వెనక్కు తీసుకుంటూ సంబంధిత వర్గాలకు క్షమాపణలు చెప్పారు.
విశ్వ బ్రాహ్మణులను ఉద్దేశించి ఓ ప్రవచనంలో చెప్పిన మాటలు ప్రముఖ పండితులు గరికిపాటి నరసింహారావును వివాదంలో నెట్టింది.దీంతో ఎప్పటి నుంచో ఆయనపై నిరసనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.తమను కించపరుస్తూ 2006లో ఓ ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో గరికిపాటి మాట్లాడారంటూ ఇవాళ భీమవరం వచ్చిన ఆయనను ఘెరావ్ చేశారు. ఆయనకు వ్యతిరేకంగా ర్యాలీ తీశారు. ధర్నా చేశారు. ఈ రోజు అక్కడ ఆనంద్ ఫంక్షన్ హాల్లో ఆయన ప్రవచనం చెప్పాల్సి ఉంది.దీంతో ఫంక్షన్ హాలుకు చేరుకుని గరికిపాటికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.దీంతో ఆయనకూ,ఆందోళనకారులకూ మధ్య చర్చలు జరిగాయి. పోలీసుల జోక్యంతో వివాదం సర్దుమణిగింది.గరికిపాటి వారికి క్షమాపణలు చెప్పారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి