ఉక్రెయిన్ లో జరిగిన దాడుల్లో ఓ భారతీయుడు ప్రాణాలు వదిలాడు. రెండో అతిపెద్ద నగరమైన ఖర్కీవ్ లో రష్యా మిస్సైల్ దాడిలో కర్ణాటకకు చెందిన మెడికల్ విద్యార్థి నవీన్ మరణించాడు. అతడు ఫుడ్ కోసం బయటకు వెళ్లిన సమయంలో అక్కడి గవర్నర్ హౌస్, సిటీ హాల్ పై మిస్సైల్ దాడి జరిగింది. ఇప్పటికే 3 నుంచి 4వేల మంది భారతీయులు ఖర్కీవ్ లో చిక్కుకున్నారు.

ఉక్రెయిన్ లోని ఖార్కివ్ రష్యా దాడుల్లో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న నవీన్ అనే భారతీయ విద్యార్థి చనిపోవడంపై విదేశాంగ శాఖ సంతాపం తెలిపింది. కర్ణాటకలోని హవేరీ జిల్లాకు చెందిన నవీన్ కుటుంబ సభ్యులతో మాట్లాడిన విదేశాంగ శాఖ.. అతడు చనిపోయిన సమాచారాన్ని తెలియజేసింది. అలాగే రష్యా, ఉక్రెయిన్ రాయబారులతో మాట్లాడిన విదేశాంగ శాఖ.. ఉక్రెయిన్ లో ఉన్న భారతీయుల రక్షణకు చర్యలు చేపట్టాలని కోరింది.

మరోవైపు ఉక్రెయిన్-రష్యా మధ్య తొలి దఫా చర్చలు బెలారస్ సరిహద్దుల్లో సుమారు నాలుగు గంటల పాటు సాగాయి. ఇరు దేశాలు తమ డిమాండ్లు వినిపించాయి. ఈ చర్చల్లో ఎలాంటి సానుకూల ఫలితం రాలేదు. ఈ క్రమంలోనే మరో దఫా చర్చలకు ఇరు దేశాలు సిద్ధమయ్యాయి. పోలిష్-బెలారస్ సరిహద్దు ప్రాంతంలో చర్చలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే సమయంపై క్లారిటీ రాలేదు.

ఉక్రెయిన్ పై రష్యా దాడిపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ దగ్గర ఉన్న 750కోట్ల రూపాయల విలువైన లగ్జరీ నౌకను హ్యాకర్లు టార్గెట్ చేశారు. యూబీజీవీ8 పేరుతో పిలిచే ఆ నౌక పేరును ఎఫ్ సీకే పీటీఎన్ అంటూ మార్చేశారు. నౌక గమ్యాన్ని హెఈఎల్ఎల్ అని పేర్కొన్నారు. సముద్రాల్లో నౌకల మార్గాలను ట్రాక్ చేయడానికి వినియోగించే ఆటోమెటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ను మార్చి నష్టాన్ని కలిగించారు.


ఉక్రెయిన్ లో మన భారతీయల విద్యార్థులు ఇంకా ఉన్నారు. వారు తమ ప్రాణాలు రక్షించేందుకు శతవిథాలా ప్రయత్నిస్తున్నారు. బార్డర్లకు రావాలంటేనే జంకుతున్నారు.


 




>>


మరింత సమాచారం తెలుసుకోండి: