మొదటి నుంచి రష్యా టార్గెట్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీయే. అయినా ఆయన ఎక్కడా బెదరలేదు. ఆయనకే కాదు జెలెన్ స్కీ సతీమణి వొలెనా జెలెన్ స్కా కూడా వెన్ను చూపడం లేదు. తమ దేశం రండి అంటూ ప్రపంచ దేశాలు జెలెన్ స్కా ఫ్యామిలీకి ఇచ్చిన ఆఫర్ ను ఆమె తిరస్కరించారు. తనకు భయం లేదనీ.. కన్నీరు రాదనీ.. తన పిల్లలతో సహా ఇక్కడే ఉండాలి.. తన భర్త కూడా పక్కనే ఉండాలంటోంది. దేశ ప్రజలతోనే ఉండాలి అంటూ జెలెన్ స్కీ సతీమణి వొలెనా జెలెన్ స్కా అంటున్నారు. ఇక ఉక్రెయిన్ పై రష్యా తన దాడులను ఆపడం లేదు. ఖర్కివ్ లోని ఇళ్లపై రష్యా వైమానిక దాడులు చేయగా.. 8మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వరుస దాడులతో ఉక్రెయిన్ ప్రజలు భయాందోళనలకు గురవుతుండగా... ఎక్కడ చూసినా యుద్ధం పేరుతో రష్యా చేసిన నష్టమే కళ్లకు కనిపిస్తోంది. లక్షల మంది ఉక్రెయిన్ కు వదిలివెళ్లారు.
ఉక్రెయిన్ పై రష్యా దాడితో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై రష్యా బలగాలు తీవ్రంగా విరుచుకుపడుతున్న సందర్భంగా అక్కడున్న భారత ఎంబసీని మూసివేస్తున్నట్టు విదేశాంగ శాఖ ప్రకటించింది. దౌత్య సిబ్బందిని మరోచోటికి తరలించినట్టు తెలిపింది. ప్రస్తుతం కీవ్ లో భారతీయులెవరూ లేరని పేర్కొంది. మరోవైపు భారతీయుల తరలింపు కొనసాగుతోంది. మరోవైపు ఉక్రెయిన్ తో యుద్ధం కారణంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ తన కుటుంబ సభ్యుల్ని రహస్య ప్రాంతానికి తరలించినట్టు బ్రిటన్ కు చెందిన ఓ వార్తా సంస్థ వెల్లడించింది. అణు యుద్ధం జరిగినా సురక్షితంగా ఉండేలా సైబీరియా ప్రాంతంలో ఓ బంకర్ ని ఏర్పాటు చేసినట్టు తెలిపింది. అట్లయ్ పర్వత ప్రాంతంలో అత్యాధునిక వసతులతో నిర్మించిన బంకర్ కు పుతిన్ తన కుటుంబ సభ్యుల్ని తరలించారని బ్రిటన్ మీడియా తెలిపింది.
ఇదిలా ఉండగా.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వతసభ్యత్వం కలిగిన రష్యాను తొలగించేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్టు బ్రిటన్ తెలిపింది. భద్రతా మండలిలో చైనా, ఫ్రాన్స్, రష్యా, అమెరికా, బ్రిటన్ దేశాలు శాశ్వత సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. మరో పది సభ్య దేశాలను రెండేళ్ల కాల పరిమితితో సాధారణ సభ ఎన్నుకుంటుంది. ఉక్రెయిన్ పై సైనిక చర్యను ఖండిస్తూ ఇటీవల ఓ తీర్మానం ప్రవేశపెట్టగా.. రష్యా వీటో ద్వారా అడ్డుకుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి