ఒకవైపు ఉక్రెయిన్ పై రష్యా సైన్యాలు యుద్ధం చేస్తునే మరోవైపు అధ్యక్షుడు జెలెన్ స్కీపై హత్యకు ప్రయత్నాలు చేస్తోందట. ఉక్రెయిన్ అధ్యక్షుడిని హత్య చేసేందుకు రష్యాకు చెందిన ప్రైవేటు పారా మిలిటరీ గ్రూపు వాగ్నర్ గ్రూపుతో పాటు చెచెన్ ప్రైవేటు సైన్యం ప్రయత్నించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని జెలెన్ స్కీ వ్యక్తిగత భద్రతా సిబ్బందితో పాటు ఉక్రెయిన్ మిలిటరీ అధికారులు చెప్పటం సంచలనంగా మారింది.





ఒకవైపేమో ఉక్రెయిన్ను మొత్తాన్ని నేలమట్టం చేసేందుకు రష్యా సైన్యం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కీలకమైన నగరాల్లో ఒకదాన్ని తర్వాత మరొకటి కబ్జా చేసేందుకు పెద్దఎత్తున ప్రయత్నిస్తోంది. ఖర్నేస్ నగరాన్ని ఇప్పటికే స్వాధీనం చేసుకున్నాయి. రాజధాని కీవ్ నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో అన్నీవైపులా తిష్టవేసుకుని కూర్చున్నాయి. దేశంలోని అనేక కీలకమైన ప్రాంతాలను స్వాధీనం చేసుకునేందుకు సైన్యం తెగ ప్రయత్నిస్తోంది.





యుద్ధం సరిపోదన్నట్లుగా మరోవైపు వాగ్నర్ గ్రూపు, చెచెన్ ప్రైవేటు సైన్యంతో ఏకంగా ఉక్రెయిన్ అధ్యక్షుడిని హత్య చేయించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు పెరిగిపోతున్నాయి. వారంరోజుల్లో మూడుసార్లు హత్యాయత్నాలంటె మామూలు విషయంకాదు. అయితే ఈ విషయాలను ముందే పసిగట్టిన ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్+రెగ్యులర్ ఇంటెలిజెన్స్ అప్రమత్తవటంతో మూడు ప్రయత్నాలు ఫెయిలయ్యాయట.





రష్యాలో వాగ్నర్ గ్రూపు అనేది చాలా పాపులర్. మన దగ్గర ప్రైవేటు సైన్యాలున్నట్లే రష్యాలో కూడా వాగ్నర్ గ్రూప్ పేరుతో ప్రైవేటుసైన్యం ఉంది. ఇది పుతిన్ సన్నిహితుల ఆధీనంలో మాత్రమే పనిచేస్తుంది. దీనికి టార్గెట్ ఇస్తే పని పూర్తికానిదే బాధ్యతలు తీసుకున్నవారు వెనక్కురారట. ప్రపంచంలో ఎవరిని చంపాలని టార్గెట్ గా పెట్టుకున్నా రష్యా నుండి వాగ్నర్ గ్రూపులోని సభ్యులు మాత్రమే వెళతారట. ఈ గ్రూపులో మిలిటరీ శిక్షణ తీసుకున్న, అత్యంత ఆధునికమైన ఆయుధాలు ఉపయోగించగల, యుద్ధరీతుల్లో శిక్షణ తీసుకున్నవారు సుమారు 10 వేలమంది ఉన్నట్లు సమాచారం. ఇపుడు ఉక్రెయిన్ అధ్యక్షుడి హత్య కోసం వీళ్ళే ప్రయత్నించారట.

మరింత సమాచారం తెలుసుకోండి: