ప్రస్తుత జనరేషన్ లో స్మార్ట్ ఫోన్లు అనేవి ఎంతగా అలవాటు అయిపోయాయి అంటే పేదవారైనా, ధనికులైనా మిగిలిన అవసరాలు ఎలా ఉన్నా చేతిలో మాత్రం స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. చేతిలో కాసేపు ఫోన్ లేకపోతే ప్రపంచమే ఆగిపోతుందేమో అన్నంతగా ఫీల్ అవుతున్నారు చాలా మంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా అంతా ఫోన్లు వాడేస్తున్నారు. ఎంత బిజీగా ఉన్నా ఎలాగోలా అలా ఓ లుక్ ఫోన్ పై వేసేయాల్సిందే. అందులోనూ వినోదాత్మక కార్యక్రమాలు, ఆన్లైన్ షాపింగ్ లు వంటివి వచ్చాక స్మార్ట్ ఫోన్ల వాడకం మరింత పెరిగింది. పొద్దున్న లేచింది మొదలు నిద్రపోయే ముందు వరకు చేతిలో ఫోన్ ఉండాల్సిందే మరి.

అయితే మద్రాసు హైకోర్టు ఫోన్ ప్రియులకు గట్టి షాక్ ఇచ్చింది. అయితే ఇది ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగ సమయం లో వ్యక్తిగత అవసరాల కొరకు మొబైల్ ఫోన్లను వాడకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ప్రభుత్వ కార్యాలయాల్లో పని వేళల్లో ఫోన్లు వాడరాదని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను వెంటనే రూపొందించాలి అంటూ సూచించింది. రూల్స్ ఫాలో అవని  ఉద్యోగుల పై చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సమాచారాన్ని వేగంగా అందరికి అందచేయాలని సూచించింది.

అయితే వాస్తవంగా చూస్తే మద్రాస్ హై కోర్ట్ చెప్పిన విధముగా చేయడం ఎంతవర్కౌ వీలవుతుంది అన్న విషయంపై ఆల్రెడీ చర్చలు మొదలైపోయాయి. కానీ ఫోన్ అనేది ఒక మనిషికి అన్నా కూడా ఎక్కువ ప్రాధాన్యతను కలిగి ఉంది. ప్రభుత్వ కార్యలయాల్లో పని చేసినంత సేపు ఒకే, కానీ పని లేదనుకోండి అప్పుడు బోర్ కొడుతుంది. వాళ్ళు అంతా ఏమి చేయాలి. మళ్ళీ తప్పక ఫోన్ ఓపెన్ చేసి టిక్ టాక్ రీల్స్ చూసుకుంటూ గడిపేస్తారు. కానీ కొత్తగా తీసుకోవచ్చే ఈ రూల్ తో వీరి ఆటలు సాగుతాయా అన్నది సందేహాస్పదమే?

మరింత సమాచారం తెలుసుకోండి: