కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ ఇలాగే జరుగుతుంటుంది. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న అంతర్గత కలహాలు మాత్రం కామనే. ఇప్పటికే ఏఐసీసీ స్ధాయిలో సోనియాగాంధిని జీ 23 పేరుతో కొందరు సీనియర్ నేతలు గోల గోల చేస్తున్నారు. జనాలముందు పార్టీని ఎంత కంపు చేయాలో శక్తవంచన లేకుండా అంతా చేస్తున్నారు. అదే తరహాలో తెలంగాణా కాంగ్రెస్ లో కూడా కంపు మొదలైంది.





తెలంగాణా కాంగ్రెస్ లోని కొందరు సీనియర్లు ఓ హోటల్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మర్రి శశిధరరెడ్డి, వీహెచ్, దుద్దిళ్ళ శ్రీధర్, జగ్గారెడ్డి, శ్యామమోహన్ రావు, కమలాకర్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం ముఖ్యఉద్దేశ్యం పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని తప్పించటమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇపుడు సమావేశమైన వారిలో అత్యధికులు రేవంత్ ను మొదటినుండి వ్యతిరేకిస్తున్న వారే. ఎలాగైనా రేవంత్ ను దింపేసి తాము పగ్గాలు చేప్పటేందుకు ఎవరికి వాళ్ళు గా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. 





నిజానికి ఇప్పటి పరిస్ధితుల్లో పీసీసీగా రేవంతే బెస్ట్ ఛాయిస్ అని చెప్పాలి. ఎందుకంటే కేసీయాఆర్ తో బద్ద విరోధముంది. కాబట్టి ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కారు. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న నేత. అలాగే రేపటి ఎన్నికల్లో పార్టీకి అవసరమైన నిధులను తేలిగ్గా తీసుకురాగలరు. అన్నింటికీ మించి చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా సుత్తిలేకుండా సెటైర్లు వేస్తు చెప్పగలిగిన వ్యక్తి.





ఇదే సమయంలో రేవంత్ ను వ్యతిరేకిస్తున్న వారిలో అత్యధికులకు రేవంత్ కున్న కెపాసిటిల్లో చాలావరకు లేవనే చెప్పాలి. అయినా సరే రేవంత్ ను దించేయాలి, తామెక్కేయాలనే కోరికే బలంగా కనిపిస్తోంది. ఏదేమైనా ఢిల్లీలో సోనియా ఎదుర్కొంటున్న సమస్యే హైదరాబాద్ లో రేవంత్ కు మొదలైంది. విచిత్రమేమిటటే తమకు కెపాసిటి లేదు అంతో ఇంతో ఉన్న రేవంత్ ను ముందుకు స్వేచ్చగా పోనియ్యరు. మొత్తానికి కాంగ్రెస్ కు కాంగ్రెస్సే శతృవన్న నానుడిని కాంగ్రెస్ నేతలు ఎల్లకాలం నిజం చేయటంలోనే పరితపిస్తుంటారు. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: